హరికృష్ణ తన ఆలోచన మార్చుకున్నారా?

చంద్రబాబు తన కుమారుడు నారా లోకేష్ రాజకీయ రంగ ప్రవేశాన్ని వాయిదా వేసిన విషయం స్పష్టంగానే అర్థమవుతోంది. నారా లోకేష్‌కు చంద్రబాబు తన వారసత్వాన్ని, పార్టీ పగ్గాలను అప్పగించడానికి వేసిన ఎత్తుగడకు వ్యతిరేకంగానే హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ తిరుగుబాటుకు సిద్ధపడ్డారనే వార్తలు వచ్చాయి. చంద్రబాబు తన ఆలోచనను వాయిదా వేయడంతో హరికృష్ణ వెనక్కి తగ్గారని అంటున్నారు. చంద్రబాబు వ్యూహానికి అనుగుణంగానే తమ వ్యూహాన్ని అమలు చేయాలనే ఉద్దేశంతో ఆయన ఉన్నట్లు చెబుతున్నారు.
నందమూరి బాలకృష్ణ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించడానికి ముందుకు రావడం వల్ల కూడా హరికృష్ణ చల్లబడి ఉండవచ్చునని చెబుతున్నారు. బాలకృష్ణను ఎదిరించడం హరికృష్ణ లక్ష్యం కాదని, ఎన్టీఆర్ వారసుల చేతిలోకే చంద్రబాబు తర్వాత పార్టీ పగ్గాలు రావాలనేది హరికృష్ణ అభిమతమని అంటున్నారు. బాలకృష్ణ పార్టీ పగ్గాలను చేపడితే ఆయనకు అభ్యంతరం ఉండకపోవచ్చునని అంటున్నారు.












Click it and Unblock the Notifications