జగన్ పార్టీ 'శంకర్‌ దాదా'గిరి: కెసిఆర్ భార్యకు చీర

K Chandrasekhar Rao-Kotamreddy Sridhar Reddy
రెండు రోజుల క్రితం కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్లలో తమ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ చేపట్టిన చేనేత దీక్షను అడుగడుగునా అడ్డుకున్న తెలంగాణ రాష్ట్ర సమితిపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు గాంధీగిరి ప్రయోగించారు. జాతిపిత మహాత్మా గాంధీని ఆదర్శంగా తీసుకొని హిందీలో సంజయ్ దత్ ప్రధాన పాత్రలో మున్నాబాయ్ సినిమా తీసిన విషయం తెలిసిందే. తెలుగులో కూడా చిరంజీవి హీరోగా శంకర్ దాదా జిందాబాద్ పేరుతో అదే సినిమాను తెరకెక్కించారు.

ఈ సినిమాలు విడుదలయ్యాక గాంధీగిరికి మరింత పాపులారిటీ వచ్చింది. అప్పటి నుండి పలువురు గులాబీ పూవులు తదితరాలతో గాంధీగిరి ప్రదర్శిస్తున్నారు. విజయమ్మ దీక్షను అడ్డుకున్నందుకు గాను తాజాగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కూడా టిఆర్‌ఎస్‌పై గాంధీగిరిని ప్రయోగించింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన జగన్ పార్టీ నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు సతీమణి శోభకు ఓ చీరను పంపించారు.

జిల్లాకు చెందిన నేత కార్మికులు నేసిన సిల్క్ చీరను అతను మంగళవారం శోభకు పంపించారు. ఈ సందర్భంగా అతను ఓ లేఖను కూడా దాంతో పాటు పంపించారు. సోదరి శోభ.. తన భర్త కెసిఆర్‌కు, తన తనయుడు, సిరిసిల్ల శాసనసభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ఆడపడుచులతో ఎలా మసలుకోవాలో కాస్త చెప్పమని ఆ లేఖలో సూచించారు.

వైయస్ విజయమ్మ కాన్వాయ్ పైకి తెరాస నేతలు రాళ్లు, చెప్పులు, గుడ్లు, వాటర్ బాటిళ్లు విసిరి వేశారని, ఇదేనా ఆడపడుచులను గౌరవించే పద్ధతి అని, విజయమ్మపై దాడి ద్వారా ఆడపడుచులపై తెలంగాణ రాష్ట్ర సమితి వైఖరి తేటతెల్లమవుతోందని ఈ సందర్భంగా అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+