తండ్రి సుల్తాన్ వేషభాషల్లో అసదుద్దీన్

Asaduddin following his father
హైదరాబాద్: ఉన్నత విద్యను అభ్యసించిన మజ్లీస్ చీఫ్, హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ వేషభాషల్లో తన తండ్రి సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీని అనుసరిస్తున్నట్లు కనిపిస్తున్నారు. కుర్తా, పైజామాలు ధరించి, నెత్తిన టోపీ పెట్టి అచ్చం తండ్రిలా కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. గడ్డం కూడా అదే రీతిలో ఉంది. ఆధునికతను పక్కన పెట్టేసి, తండ్రి రూపంలోకి ఆయన పరకాయ ప్రవేశం చేసినట్లు కనిపిస్తున్నారు.

పాతబస్టీపై పట్టు సాధించి, తన ఆధిపత్యాన్ని నిలుపుకుంటూ వచ్చిన అసదుద్దీన్ తండ్రి సలావుద్దీన్ ఓవైసీ సాలార్‌గా పేరు గడించారు. సలావుద్దీన్ ఓవైసీ హయాంలో బిజెపి నేతలు నరేంద్ర, బద్దం బాల్ రెడ్డి వంటివారి నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదరవుతూ వచ్చింది. క్రమంగా బిజెపి ప్రాబల్యం పాతబస్తీలో తగ్గింది. అయితే, తన పార్టీ నుంచి విడిపోయి మరో పార్టీ పెట్టిన అమానుల్లా ఖాన్ నుంచి సలావుద్దీన్ ఓవైసీకి ప్రతిఘటన ఎదురైంది.

పాతబస్టీ రాజకీయ ఆధిపత్య పోరులో ఓవైసీ అమానుల్లా ఖాన్‌పై కూడా విజయం సాధించారు. ఇప్పుడు పార్టీ అసదుద్దీన్ చేతుల్లోకి వచ్చింది. ఇప్పుడు ఆయనకు బిజెపి నాయకుల నుంచి కన్నా కాంగ్రెసు నేతల నుంచి ఎక్కువ సవాల్ ఎదురవుతున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఆయన లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారు. దానికితోడు, పాతబస్తీలో పెహల్వన్ వంటివారి వ్యతిరేకత కూడా మజ్లీస్‌కు ఎదురవుతోంది.

పెహెల్వన్ మజ్లీస్ శాసనసభ్యుడు, తన సోదరుడు అక్బరుద్దీన్‌పై దాడి చేయడం ద్వారా అసదుద్దీన్‌కు సవాల్ విసిరినట్లేనని భావిస్తున్నారు. పాతబస్తీలో తమ ఆధిక్యతను నిలుపుకోవడానికి ఆధునిక భావజాలాలను పక్కన పెట్టేసి పాత సంప్రదాయాన్ని కొనసాగించాలని అసదుద్దీన్ భావిస్తున్నట్లు అర్థమవుతోందని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో హైదరాబాదులో మరింతగా విస్తరించడంతో పాటు జిల్లాల్లో కూడా పునాదులు ఏర్పాటు చేసుకోవాలని మజ్లీస్ అగ్రనేత అసదుద్దీన్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

తన విస్తరణ వ్యూహంలో భాగంగానే దూకుడుగా ముందుకు వెళ్తున్నారని అంటున్నారు. ఒక వర్గాన్ని పూర్తిగా తన వైపు కట్టి పడేసుకోవడానికి అసదుద్దీన్‌తో పాటు అక్బరుద్దీన్ కూడా పరిమితులు దాటి వ్యవహరిస్తున్నారనే మాట వినిపిస్తోంది. తమ వ్యూహంలో భాగంగా తెలంగాణను అడ్డుకుంటూ, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌తో దోస్తీ చేసి రాయలసీమ, తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో పాగా వేయాలని కూడా భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+