వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిరణ్ సీతయ్య రోల్ వెనుక బాత్‌రూం లీక్!?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తీసుకునే పలు నిర్ణయాలు ఏకపక్షంగా ఉంటాయని, మంత్రులు, ఇతర సభ్యులతో ఆయన చర్చించకుండానే నిర్ణయాలు తీసుకుంటారనే విమర్శలు ఉన్న విషయం తెలిసిందే. కిరణ్ తన ఏకపక్ష నిర్ణయాల వల్ల మంత్రులలో విశ్వాసాన్ని పెంపొందించలేక పోతున్నారట. కిరణ్ తమతో సంక్షేమ పథకాలపై, ఇతర ముఖ్యమైన రాజకీయ విషయాలపై ఏమాత్రం చర్చించడం లేదని మంత్రుల నుండి విమర్శలు కూడా ఉన్నాయి.

పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఆరోగ్య శాఖ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి సహా పలువురు కిరణ్ వైఖరి పట్ల తమ అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. సంబంధిత మంత్రులకు కూడా ఆయా పథకాలు, విధానాల పైన ఆఖరి నిమిషంలో చెప్పిన సందర్భాలు ఉన్నాయనే విమర్శలు ఉన్నాయి. అయితే, కిరణ్ కుమార్ రెడ్డి ఏకపక్షంగా వెళ్లడానికి కారణాలు ఉన్నాయట.

ముఖ్యమంత్రి పలు అంశాలు, పథకాలపై ఇతరులతో చర్చించవద్దనే ప్రత్యేక ఉద్దేశ్యంతో లేరట. కానీ, నేతల వైఖరి నచ్చకనే ఆయన తన నిర్ణయాలను ఆఖరి నిమిషంలో చెప్పడం, ఏకపక్షంగా తీసుకోవడం చేస్తున్నారని అంటున్నారు. ముఖ్యమంత్రి ఏదైనా విషయాన్ని చర్చిస్తే అది వెంటనే బయటకు లీక్ అవుతుందట. సిఎం పలు సీక్రెట్ అంశాలు, సెన్సిటివ్ ఇష్యూలు చర్చించిన వెంటనే అవి బయటకు వస్తున్నాయట. మీడియాకు చేరిపోయి క్షణాల్లో వస్తున్నాయట.

ఏదైనా విషయాలపై ముఖ్యమంత్రి నేతలతో చర్చించినప్పుడు అక్కడ ఎవరూ ఉండకున్నా బయటకు రావడంపై కిరణ్ అసంతృప్తితో ఉన్నారట. చర్చ సమయంలో కొందరు బాత్‌రూం కోసమని వెళ్లి అక్కడి నుండి సమాచారాన్ని సంక్షిప్త సందేశాల(ఎస్సెమ్మెస్) రూపంలో లీక్ చేస్తున్నారట. దీంతో నిమిషాల్లో మీడియాలో చర్చకు సంబంధించిన విషయాలు బయటకు వస్తున్నాయట. ఈ విషయం తెలిసిన పలువురు కిరణ్‌ను తప్పు పట్టడం లేదట.

English summary
Why is Chief Minister Kiran Kumar Reddy accused of not taking his Cabinet colleagues into confidence? Most ministers complain that Reddy doesn’t discuss policy matters or important political issues with them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X