బాలయ్య కూతురు పెళ్లి: సెలబ్రిటీల సందడి(పిక్చర్స్)
హైదరాబాద్ : బాలయ్య కూతురు తేజస్విని పెళ్లి వేడుకను పురస్కరించుకుని తెలుగు సినిమా కుటుంబానికి చెందిన వారంతా హాజరై సందడి చేసారు. తేజస్విని వివాహం మతుకుమిల్లి శ్రీభరత్‌తో ఈ ఉదయం 8.52కు హైటెక్స్‌లో ఘనంగా జరిగింది. మెగాస్టార్ చిరంజీవితో పాటు సూపర్ స్టార్ కృష్ణ, మోహన్ బాబు, కృష్ణం రాజు, మంచు మనోజ్, పరుచూరి బ్రదర్స్, అలీ, రోజా, మంచు లక్ష్మి, జగపతి బాబు, శ్రీకాంత్, బోయపాటి శ్రీను, తరుణ్, శివాజీ రాజా, సినీ నిర్మాత రామోజీరావు, హీరో ఉదయ్ కిరణ్, కళ్యాణ్ రామ్, రాఘవేంద్రరావు తదితరులు హాజరయ్యారు.
ఈ వివాహానికి పలువురు కేంద్ర మంత్రులతోపాటు సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన దిగ్గజాలు హాజరయ్యారు. వివాహ వేడుకకు నారా చంద్రబాబు నాయుడు, రామోజీరావు, కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, పురందేశ్వరి, చిరంజీవి, జైపాల్‌రెడ్డి, తమిళనాడు గవర్నర్ రోశయ్య, 'ఈనాడు' ఎండీ కిరణ్, మార్గదర్శి ఎండీ శైలజాకిరణ్, ఎంపీలు నామా నాగేశ్వరరావు, మాగుంట శ్రీనివాసుల రెడ్డి, కనుమూరి బాపిరాజు, రాయపాటి సాంబశివరావు, తేదేపా నేతలు యనమల రామకృష్ణుడు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, అంబికాకృష్ణ, దేవినేని ఉమా, కరణం బలరాం, భాజపా నేత బండారు దత్తాత్రేయ హాజరయ్యారు.
ఫోటోలు

చిరంజీవి
కేంద్ర మంత్రి, మెగాస్టార్ చిరంజీవి తన మిత్రుడు, సహచరుడు నందమూరి బాలకృష్ణ కుమార్తె తేజస్విని వివాహ వేడుకకు హాజరయ్యారు. పెళ్లి వేడుకలో సందడి గడిపారు.

రోజా
బాలకృష్ణతో పాటు పలు చిత్రాల్లో కలిసి నటించిన హీరోయిన్ రోజా బాలయ్య కూతురు తేజస్విని వివాహ వేడుకకు హాజరయ్యారు. అందరినీ పలకరిస్తూ ఆమె సందడిగా గడిపారు.

తరుణ్, శివాజీ
బాలకృష్ణతో పాటు పలు చిత్రాల్లో కలిసి పని చేసిన శివాజీ రాజాతో పాటు, హీరో తరుణ్ తేజస్విని పెళ్లి వేడుకకు హాజరయ్యారు. బాలయ్యకు సన్నిహితంగా ఉండే వారిలో వీరు కూడా ఒకరు.

బోయపాటి, జగపతి
దర్శకుడు బోయపాటి శ్రీను, నటుడు జగపతి బాబు బాలయ్య కూతురు తేజస్విని పెళ్లి వేడుకకు హాజరయ్యారు. ప్రస్తుతం బాలయ్య హీరోగా నటిస్తున్న చిత్రానికి బోయపాటి దర్శకత్వం వహిస్తుండగా, ఆ చిత్రంలో జగపతి బాబు విలన్ పాత్ర పోషిస్తున్నారు.

శ్రీకాంత్
నటుడు శ్రీకాంత్ బాలయ్య కూతురు తేజస్విని పెళ్లి వేడుకకు హాజరయ్యారు. బాలయ్యతో శ్రీకాంత్‌కు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ ఫోటో తరుణ్, శివాజీ రాజాలను కూడా చూడొచ్చు.

రామోజీరావు
బాలయ్య కూతురు తేజస్విని వివాహానికి ఈనాడు సంస్థల యజమాని, సినీ నిర్మాత అయిన రామోజీరావు కూడా హాజరయ్యారు. ఆయన్ను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రత్యేకంగా రిసీవ్ చేసుకున్నారు.

ఉదయ్ కిరణ్
నటసింహం నందమూరి బాలకృష్ణ కూతురు తేజస్విని వివాహానికి యువ హీరో ఉదయ్ కిరణ్ తన భార్యతో కలిసి ఈ వేడుకకు హాజరయ్యారు.

మంచు ఫ్యామిలీ, గోపీచంద్
నందమూరి బాలకృష్ణ కూతురు తేజస్విని వివాహ వేడుకకు ప్రముక నటుడు, నిర్మాత మోహన్ బాబు ఆయన కూతురు మంచు లక్ష్మి, కుమారుడు విష్ణు హాజరయ్యారు. చిత్రంలో హీరో గోపీచంద్ కూడా ఉన్నారు.

జయప్రకాష్ నారాయణ, పురంధరేశ్వరి
నందమూరి బాలకృష్ణ కూతురు తేజస్విని వివాహ వేడుకకు లోక్ సత్తా పార్టీ అధినేత, కూకట్ పల్లి ఎమ్మెల్యే జయప్రకాష్ నారాయణ, కేంద్ర మంత్రి, బాలయ్య సోదరి దగ్గుబాటి పురంధరేశ్వరి హాజరయ్యారు.

పల్లకిలో పెళ్లి కూతురు
తేజస్విని వివాహం మతుకుమిల్లి శ్రీభరత్‌తో ఈ ఉదయం 8.52కు హైటెక్స్‌లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వివాహ మండపానికి పెళ్లి కూతురు తేజస్విని పల్లకిలో తీసుకుని వచ్చారు.

శ్రీభరత్
బాలయ్యకు అల్లుడు శ్రీభరత్ మరెవరో కాదండీ....విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి, కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు మనవడు. తేజస్విని-శ్రీభరత్ వివాహ మహోత్సవం ఈ రోజు ఉదయం హైటెక్స్ లో అంగరంగ వైభవంగా జరిగింది.

నారా బ్రాహ్మణి
నందమూరి బాలకృష్ణ పెద్ద కూతురు బ్రాహ్మణి తన సోదరి తేజస్విని వివాహానికి హాజరైన దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు. తేజస్విని ఆహార్యం అంరినీ ఆకట్టుకుంది.

కళ్యాణ్ రామ్
హీరో కళ్యాణ్ రామ్ తన బాబాయ్ బాలకృష్ణ కుమార్తె తేజస్విని వివాహానికి ఇలా సాంప్రదాయ బద్దంగా హాజరయ్యారు. సొంతింటి పెళ్లి వేడుక కావడంతో ఆయన ఇక్కడ ఎంతో బాధ్యతగా వ్యవహరించారు.

మంత్రి కావూరి, ఎంపీ రాజయ్య, టీటీడీ చైర్మన్ బాపిరాజు
కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు మనవడి పెళ్లి కావడంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ రాజయ్య, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ కనుమూరి బాపిరాజు కూడా ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు.

రాఘవేంద్రరావు, మురళీ మెహన్
బాలయ్య కూతురు తేజస్విని వివాహ మహోత్సవాన్ని పురస్కరించుకుని దర్శకేంద్రుడు రాఘేవేంద్రరావు, నటుడు మురళీ మోహన్ హాజరయ్యారు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో బాలయ్య పలు చిత్రాల్లో నటించారు.

బాలయ్య కూతురు పెళ్లిలో సెలబ్రిటీల సందడి
వివాహ వేడుకలో బాలయ్య సాంప్రదాయ దుస్తుల్లో సూపర్ లుక్‌తో కనిపించారు. ఆయన స్వయంగా అతిథులకు స్వాగతం పలుకుతూ సందడి చేసారు.

నారా లోకేష్
బాలకృష్ణ పెద్ద అల్లుడు, తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు తనయుడు నారా లోకేష్ తేజస్విని-శ్రీభరత్ వివాహ వేడుకలో ఇలా సంప్రదాయ బద్దమైన దుస్తుల్లో హాజరై సందడి చేసారు.

కృష్ణం రాజు
రెబల్ స్టార్ కృష్ణంరాజు బాలయ్య కూతురు తేజస్విని వివాహ వేడుకకు భార్య, పిల్లలతో కలిసి హాజరయ్యారు. అందుకు సంబంధించిన దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు.

పరిటాల సునీత
బాలయ్య కూతురు తేజస్విని వివాహ వేడుకకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పరిటాల సునీత హాజరయ్యారు. తెలుగు దేశం పార్టీకి, నందమూరి కుటుంబానికి పరిటాల ఫ్యామిలీ ముందు నుంచి మద్దుతుగా ఉంటున్నారు.

నారా రోహిత్
హీరో నారా రోహిత్ తన బంధువైన బాలయ్య కూతురు తేజస్విని వివాహానికి హాజరయ్యారు. నారా రోహిత్ తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు సోదరుడి కుమారుడు.

సన్నిహితులంతా..
తేజస్విని-శ్రీభరత్‌ల వివాహానికి ఇరు కుటుంబాలకు చెందిన సన్నిహితులు, బంధువులు, శ్రేయోభిలాషులు, స్నేహితులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. అందుకు తగిన విధంగా భారీ గా ఏర్పాట్లు చేసారు.

పరుచూరి వెంకటేశ్వరరావు
బాలయ్య కూతురు తేజస్విని వివాహ వేడుకకు ప్రముఖ సినీ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు హాజరయ్యారు. సినీ పరిశ్రమకు సంబంధించి బాలయ్యకు బాగా సన్నిహితుల్లో ఈయన ఒకరు. బాలయ్య నటించిన హిట్ చిత్రాలకు ఈయన రచనలు చేసారు.

మంచు మనోజ్
టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ బాలయ్య కూతురు తేజస్విని వివాహానికి హాజరయ్యారు. గతంలో బాలయ్య, మనోజ్ కలిసి ఊకొడతారా, ఉలిక్కి పడతారా చిత్రంలో కలిసి నటించారు.

పరుచూరి గోపాల కృష్ణ
బాలయ్య కూతురు తేజస్విని వివాహ వేడుకకు ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాల కృష్ణ హాజరయ్యారు. సినీ పరిశ్రమకు సంబంధించి బాలయ్యకు బాగా సన్నిహితుల్లో ఈయన ఒకరు. బాలయ్య నటించిన హిట్ చిత్రాలకు ఈయన రచనలు చేసారు.

మోహన్ బాబు, విష్ణు
ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు, ఆయన కుమారుడు హీరో విష్ణు బాలయ్య కూతురు తేజస్విని వివాహ వేడుకకు హాజరయ్యారు. అందుకు సంబంధించిన దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు.

మంచు లక్ష్మి
మోహన్ బాబు కూతురు, నటి, నిర్మాత మంచు లక్ష్మీ ప్రసన్న బాలయ్య కూతురు వివాహానికి హాజయ్యారు. బాలయ్యకు సన్నిహితంగా ఉండే సినీ కుటుంబాల్లో మంచు కుటుంబాన్ని ప్రముఖంగా చెప్పుకోవచ్చు.

స్నేహితులు
తేజస్విని-శ్రీభరత్‌ల వివాహానికి ఇరు కుటుంబాలకు చెందిన సన్నిహితులు, బంధువులు, శ్రేయోభిలాషులు, స్నేహితులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. అందుకు తగిన విధంగా భారీ గా ఏర్పాట్లు చేసారు.

కమెడియన్ అలీ
ప్రముఖ తెలుగు హాస్యనటుడు అలీ బాలయ్య కూతురు తేజస్విని వివాహానికి హాజరయ్యారు. బాలయ్యతో కలిసి అలీ అనేక చిత్రాల్లో నటించారు. బాలయ్యకు సన్నిహితంగా ఉండే వారిలో అలీ ఒకరు.

జివి సుధాకర్ నాయుడు
నటుడు, దర్శకుడు జీవీ సుధాకర్ నాయుడు బాలయ్య కూతురు తేజస్విని వివాహ వేడుకకు హాజరయ్యారు. బాలయ్యతో సినిమా చేయడానికి జీవి సుధాకర్ నాయుడు ప్రయత్నాలు చేస్తున్నారు.

బాబూ మోహన్
ప్రముఖ హాస్యనటుడు, రాజకీయ నాయకుడు బాబూ మోహన్ బాలయ్య కూతురు తేజస్విని పెళ్లి వేడుకకు హాజయ్యారు.
-
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది












Click it and Unblock the Notifications