వెన్ను, కాళ్ల నొప్పులు: బాబుకు రెండు వారాల విశ్రాంతి

నొప్పులతోపాటు కాలి చిటికెన వేలు గాయం మూడు నెలలుగా ఆయనను బాధిస్తోంది. ఇవన్నీ పూర్తిగా తగ్గాలంటే రెండు వారాలపాటు ఇల్లు కదలకుండా విశ్రాంతి తీసుకోవాల్సిందేనని వైద్యులు స్పష్టం చేశారు. సుదీర్ఘ పాదయాత్రను ముగించుకుని వచ్చిన చంద్రబాబు సోమవారం రెండు సంతాప కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
కాలి నొప్పికి తగినట్లు వాడిన బూట్ల స్థానంలో చంద్రబాబు వేరే బూట్లను వాడారు. దీంతో కాలినొప్పి పెరిగింది. వాహనం ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు కాస్తా ఇబ్బంది పడ్డారు. సోమవారం చంద్రబాబు ఇంటికే పరిమితమయ్యారు. ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. పార్టీ కార్యాలయానికి రావడం లేదని, అపాయింట్‌మెంట్లు వద్దని ఆయన చెప్పారు.
లండన్‌లో విజయోత్సవ సభ చంద్రబాబు పాదయాత్ర ముగింపు సందర్భంగా లండన్‌లో ఒక విజయోత్సవ సభ సోమవారం జరిగింది. తెలుగుదేశం ఎన్ఆర్ఐ విభాగం యూకే, యూరప్ శాఖల ఆధ్వర్యంలో ఈ సభను నిర్వహించారు. యూకె విభాగం అధ్యక్షుడు గుంటుపల్లి జయకుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ విజయోత్సవాల్లో ప్రవాసాంద్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications