చిరంజీవి టార్గెట్‌గానే సిఐడి దాడులు?

ప్రస్తుత డిజిపి దినేష్‌రెడ్డి విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ జనరల్‌గా ఉన్న కాలంలోనే ఈ వ్యవహారాలన్నింటిపై విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. అప్పటి నుంచి అది ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉంది. ఇప్పుడు సిఐడి అధికారులు గురువారం జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ కార్యాలయంలో సోదాలు చేశారు. సాధారణంగా పాత కేసుల విషయంలో ఇన్‌స్పెక్టర్ లేదా డిఎస్పీ స్థాయి అధికారి రంగంలోకి దిగుతారు. కానీ, గురువారం నాడు ఎస్పీ నాయకత్వంలో సిఐడి బృందం సోదాలు చేసి కొన్ని ఫైళ్లను స్వాధీనం చేసుకుంది.
ఎప్పుడో ఏళ్ల క్రితంనాటి వ్యవహారాంపై సిఐడి ఇప్పుడు ఎందుకు హడావుడి చేసిందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ ఆ ఫైళ్లను చూస్తే అసలు కథ తెలుస్తుందని అంటున్నారు. కేంద్ర పర్యాటకశాఖ మంత్రి చిరంజీవికి జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ పరిధిలోనే సొంత ఇల్లు, బ్లడ్‌బ్యాంకు ఉన్నాయి. చిరంజీవి ఇంటివద్ద కొంత భూమిని ఆయన కబ్జా చేసి ఉపయోగించుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. గురువారం సొసైటీ కార్యాలయంపై దాడిచేసిన అధికారులు ఆ ఫైలునే ప్రధానంగా టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.
దానితో పాటు ఇమేజ్ ఆస్పత్రి అధినేత సివిరావు తనకు సంబంధించిన వ్యక్తికి రెండు ప్లాట్లు ఇప్పించారనే ఆరోపణలకు సంబంధించిన పత్రాలను, అప్పట్లో సొసైటీలో కీలకపాత్ర వహించిన మస్తాన్ చౌదరికి సంబంధించిన అంశాలను సిఐడి విచారణకు చేపట్టినట్లు వార్తలు వచ్చాయి. ఈ వ్యవహారంపై సిఐడి అధికారులు నోరు మెదపడం లేదు. 13 -15 వేల గజాల స్థలం జూబ్లీహిల్స్‌లో ఆక్రమణకు గురైందని, దీనికి సంబంధించి పలు ఫిర్యాదులు ఉన్నందున వాటిపై విచారణ జరుగుతోందని మాత్రమే వారంటున్నారు.












Click it and Unblock the Notifications