శ్రీనివాసన్‌కు చిక్కులు: ఐసిసి మీట్‌కు దాల్మియా
ముంబై: ఐపియల్ స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారం బిసిసిఐ అధ్యక్షుడు ఎన్ శ్రీనివాసన్‌కు కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. కాగా, ఐసిసి వార్షిక సమావేశానికి తాను వెళ్తానని బిసిసిఐ తాత్కాలిక అధ్యక్షుడు జగ్‌మోహన్ దాల్మియా చెప్పారు. ఈ విషయంపై శ్రీనివాసన్ నుంచి ఏ విధమైన సమాచారం కూడా లేదు. ఇదే సమయంలో శ్రీనివాసన్‌కు వ్యతిరేకంగా స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారం మరో మలుపు తిరిగింది.
శ్రీనివాసన్, చెన్నై, రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ యాజమాన్యాలు ఇండియా సిమెంట్స్, జైపూర్ ఐపీఎల్ క్రికెట్‌కు వ్యతిరేకంగా బీహార్ క్రికెట్ సంఘం (బిసిఎ) ముంబై హైకోర్టులో ప్రజా ప్రయోజానాల వ్యాజ్యం దాఖలు చేసింది. ఫిక్సింగ్ విచారణకు బిసిసిఐ నియమించిన దర్యాప్తు కమిటీ చట్టబద్ధతను ప్రశ్నిస్తూ, దాన్ని రద్దు చేయాల్సిందిగా బోర్డును ఆదేశించాలని కోర్టును కోరింది.

శ్రీనివాసన్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, బిసిసిఐ, తమిళనాడు క్రికెట్ సంఘం అధ్యక్ష కార్యాలయాలను ఖాళీ చేయాల్సిందిగా శ్రీనివాసన్‌ను ఆదేశించాలని బీహార్ క్రికెట్ సంఘం కోరింది. బెట్టింగ్ వ్యవహారంలో శ్రీనివాసన్ అల్లుడు గురునాథ్‌పై వచ్చిన ఆరోపణల్ని ప్రస్తావిస్తూ, అతన్ని రక్షించేందుకే విచారణ కమిటీని ఏకపక్షంగా ఏర్పాటు చేశారని ఆరోపించింది. గురునాథ్ మేయప్పన్‌ను రక్షించేందుకు శ్రీనివాసన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది.
భవిష్యత్‌లో బిసిసిఐ అధ్యక్ష పదవికి పోటీచేయకుండా శ్రీనివాసన్‌ను అడ్డుకోవాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించింది. ఐపిఎల్‌తో రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం జైపూర్ ప్రైవేట్ క్రికెట్ లిమిటెడ్, చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం ఇండియా సిమెంట్స్ చేసుకున్న ఒప్పందాల్ని రద్దు చేయాల్సిందిగా బిసిఎ కోరింది.
ఐసిసి వార్షిక సమావేశానికి బీసీసీఐ తరఫున దాల్మియా వెల్లడానికి నిర్ణయించుకున్నారు. లండన్‌లో వచ్చేవారం జరగనున్న ఐసిసి వార్షి క సమావేశాకి తానే స్వయంగా వెళ్లనున్నట్లు బిసిసిఐ తాత్కాలిక అధ్యక్షుడు జగ్‌మోహన్ దాల్మియా శుక్రవారం ప్రకటించారు. శ్రీనివాసన్ ప్రత్యేకంగా హాజరవుతారా అనే ప్రశ్నించినప్పుడు - ఆ సంగతి తనకు తెలియదని దాల్మియా సమాధామిచ్చాడు. ఐసిసి సిఇవో, వర్కింగ్ కమిటీ సమావేశాల్లో బోర్డుకు కార్యదర్శి సంజయ్ పటేల్ ప్రాతినిధ్యం వహిస్తారు. ఐసిసి ఎగ్జిక్యూటివ్ బోర్డ్, డెవలప్‌మెంట్ బోర్డు, వార్షిక సమావేశాలకు దాల్మియా వెళ్తారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications