ఈ నెల్లోనే ప్రకటన: హైదరాబాదు లేని తెలంగాణ?

"శుక్రవారం జరిగే కోర్‌కమిటీ భేటీలోనే తెలంగాణపై తుది ప్రణాళిక రచిస్తారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముందే నిర్ణయం ప్రకటించాలని కాంగ్రెస్ భావిస్తోంది. హైదరాబాద్‌లేని తెలంగాణపై కాంగ్రెస్ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించడం, తెలంగాణకు స్వయంప్రత్తితో కూడిన మండలి ఏర్పాటు చేయడంతో సహా పలు అంశాలను కోర్ కమిటీ పరిగణనలోకి తీసుకునే అవకాశాలున్నాయి'' అని సిఎన్ఎన్-ఐబిఎన్ తెలిపింది.
తెలంగాణ సమస్య పరిష్కరించేందుకు కాంగ్రెసు పార్టీ కోర్ కమిటీ ఆలోచిస్తున్న వాటిల్లో హైదారాబాదు లేని తెలంగాణ కూడా ఉందని పేర్కొంది. హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలనే విషయమై చర్చిస్తోందని, అదే సమయంలో స్వతంత్ర ప్రతిపత్తి విషయమై కూడా ఆలోచిస్తోందని పేర్కొంది.
ముఖ్యమంత్రి, డిప్యూటి, పిసిసి చీఫ్‌లు రోడ్ మ్యాప్ ఇచ్చిన వాటిని పరిశీలించి ఓ నిర్ణయం తీసుకోనుంది. ప్రత్యేక తెలంగాణ ఇస్తే ఆ ప్రాంతంలో నక్సలిజం మళ్లీ తలెత్తుతుందని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే, ఆరోగ్య మంత్రి గులాం నబీ ఆజాద్ ఆందోళన చెందుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయని పేర్కొంది. ఈ నెలాఖరులోగా తెలంగాణపై కచ్చితమైన ప్రకటన చేయనుందని అంటున్నారు.












Click it and Unblock the Notifications