వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తుఫాన్ డైలాగ్స్ జర్నలిస్టులకు వ్యతిరేకమా?

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రామ్ చరణ్ తేజ, ప్రియాంక చోప్రా నటించిన తుఫాన్ సినిమాలోని డైలాగులు పోలీసులను, జర్నలిస్టులను అవమానించే విధంగా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తుఫాన్ సినిమా హిందీలో జంజీర్‌గా విడుదలైన విషయం తెలిసిందే. షేర్ ఖాన్ పాత్ర పోషించిన శ్రీహరి నోటి నుంచి అవమానకరమైన పదం ఒకటి వెలువడిందని అంటున్నారు.

పోలీసు భద్రత మధ్య తుఫాన్ సినిమా ఆంధ్రప్రదేశ్‌లో విడుదలైన విషయం తెలిసిందే. తెలంగాణలోనే కాకుండా సీమాంధ్రలో కూడా సినిమా వ్యతిరేకతను ఎదుర్కుంది. కొన్ని చోట్ల సినిమా విడుదలను ఆందోళనకారులు అడ్డుకున్నారు.

Toofan

పోలీసులను అవమానించే డైలాగులు కూడా సినిమాలో ఉన్నాయని ప్రేక్షకులు అంటున్నారు. వారి స్థాయిని తగ్గించే విధంగా కొన్ని సంభాషణలు ఉన్నట్లు సినిమాను చూసినవారు చెబుతున్నారు. రామ్ చరణ్ తేజ పోషించిన అదనపు పోలీసు కమిషనర్ (ఎసిపి) పాత్రను ఉద్దేశించి షేర్ ఖాన్ - ఖాకీ డ్రెస్సుకు మూడు మీటర్ల బట్ట కావాలి, ఓ టోపీ కావాలి, బెల్టు కావాలని, ఖాకీ డ్రెస్సు వేసుకునే హోం గార్డు కూడా మంత్రిలాగా ఫీలవుతాడని అంటాడు.

స్థానిక గుండా అయిన షేర్ ఖాన్ పోలీసు స్టేషన్‌కు వచ్చినప్పుడు పోలీసులతో చాలా స్నేహంగా ఉన్నట్లు వ్యవహరిస్తాడు. యూనిఫాంలో ఉన్న పోలీసుల జబ్బలు చరుస్తాడు. ముంబై పోలీసులను అవమానించే ఓ సీన్ కూడా ఉందని చెబుతున్నారు. హత్య కేసు నిందితుడిని వదిలేయడానికి ఓ పోలీలు అధికారి తనకు వెల కట్టాలని అడుగుతాడు. అతను పోలీసు అమ్మకానికి, కొనడానికి సిద్ధంగా ఉన్నట్లుగా వ్యవహరిస్తాడు. సాలే నీ యయ్య, నన్నే కొనాలనుకున్నావ్ బే.. వంటి డైలాగులు కూడా ఉన్నాయి.

జర్నలిస్టులను అవమానించే మాటలు కూడా సినిమాలో ఉన్నాయని భావిస్తున్నారు. క్రైమ్ రిపోర్టర్ పాత్రను తనికెళ్ల భరణి పోషించాడు. రామ్ చరణ్ పోషించిన ఎసిపి పాత్రతో చెప్పే మాటలు

జర్నలిస్టులకు వ్యతిరేకంగా అవమానకరమైన భాషను వాడారనే విమర్శలు వస్తున్నాయి. వారి వృత్తిని అవమానించే విధంగా సినిమాలో కొన్నిదృశ్యాలు, సంభాషణలు ఉన్నాయని అంటున్నారు,. తణికెళ్ల భరణి జర్నలిస్టు పాత్రను పోషించారు. వాస్తవాలను వెలికి తీయడానికి జర్నలిస్టులు లోతుల్లోకి వెళ్లరనే నిందను సినిమా వేసింది. అయితే, అదే జర్నలిస్టు ఆయిల్ మాఫియాను పట్టించడానికి ఎసిపికి సహకరిస్తాడు.

English summary
Police have been slighted and journalists insulted, if dialogues in the just released Ram Charan Tej-starrer 'Thoofan' (Zanjeer in Hindi) have to be taken seriously.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X