మోడీకి మిత్రులే ఎసరు, లాలు వ్యంగ్యం(పిక్చర్స్)

న్యూఢిల్లీ: గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచార సారథిగా ఎన్నికవడం జీర్ణించుకోలేని నితీష్ కుమార్.. ఎన్డీయే నుండి జెడి(యు) తప్పుకుంటున్నట్లు ఆదివారం ప్రకటించారు. గోద్రా అల్లర్ల మచ్చ ఉన్నప్పటికీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎదుగుతున్న మోడీని నితీష్ ఒకప్పుడు మెచ్చుకున్నారు. గోద్రా అల్లర్ల అనంతరం కూడా మోడీని ఆయన పొగిడిన సందర్భాలు ఉన్నాయి.

ఇప్పుడు మోడిని వ్యతిరేకించడం వెనుక స్వాలాభాలే ఉన్నాయంటున్నారు. మోడీని వ్యతిరేకించడం ద్వారా లౌకికవాదిగా ముద్రపడి మైనార్టీల ఓట్లు కొల్లగొట్టవచ్చుననే వ్యూహం, ప్రధాన మంత్రి రేసులో తనకంటే మోడీ ఉండటం జీర్ణించుకోలేకపోవడం మరో కారణం కూడా అంటున్నారు. ఇటీవలి వరకు ఎన్డీయేలో ప్రధాని అభ్యర్థిగా మోడీతో పాటు నితీష్ పేరు కూడా వినిపించింది. క్రమంగా నితీష్ పేరు కనుమరుగయింది.

అదే సమయంలో మోడీకి ప్రచార బాధ్యతలు అప్పగించారు. పార్టీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ కూడా మోడీకి బాధ్యతలు అప్పగించడాన్ని వ్యతిరేకించారు, రాజీనామా చేశారు.. పార్టీ పెద్దలు, రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ నచ్చజెప్పడంతో అద్వానీ వెనక్కి తగ్గారు. అద్వానీ అంశాన్ని చూపి ఎన్డీయే నుండి వైదొలగాలని చూశారు. కుదరక తప్పని స్థితిలో ఇక గోవా నిర్ణయాలు బాధించాయని చెప్పి ఆదివారం రాం రాం చెప్పారు.

ప్రధాని పీఠం తర్వాతే...

మోడీ అంటే నితీష్‌కు మొదట్లో ఎలాంటి కోపం లేదు. 2003 గోద్రా అల్లర్ల సమయంలో ఆయనే కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా ఉన్నారు. చాలా రాజకీయ పార్టీలో మోడీ రాజీనామాకు డిమాండ్ చేసినప్పుడు, ఎన్డీయేలోని కొన్ని పక్షాలు సైతం గళం కలిపాయి. కానీ నితీష్ మాత్రం మోడిని వెనుకేసుకొచ్చారు. ఆ సమయంలో ఎల్జెపి నేత రాంవిలాశ్ పాశ్వాన్ కూటమి నుండి బయటకు వచ్చారు. అదే సమయంలో నితీష్.. మోడిపై ప్రశంసలు కురిపించారు.

మోడీ ఏదో ఒక రోజు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతారని ఆకాశానికెత్తేశారు. ప్రధాని పీఠంపై ఇద్దరు కన్ను పడిన తర్వాతనే చెడిందని చెప్పవచ్చు. 2010 బిహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో స్థానిక మీడియా మోడీకి అధిక ప్రాధాన్యత ఇవ్వడం కూడా నితీష్ జీర్ణించుకోలేక పోయారంటారు. తాను లౌకికవాదినని, మోడీతో ఎక్కువగా కలిసి ఉండే నష్టం జరుగుతుందని భావించిన నితీష్ అప్పటి నుండి ఎన్డీయేకు దూరంగా జరిగే ప్రయత్నాలు చేస్తున్నారట.

ఒకప్పటి మిత్రులు!

గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని సాకుగా చూపి ఎన్డీయే కూటమి నుండి వైదొలిగిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఒకప్పుడు ఆయనను ప్రశంసించిన సందర్భాలు ఉన్నాయి. ఏ గోద్రా అల్లర్లపై మోడీని వ్యతిరేకించి కరడుగట్టిన లౌకికవాద ముద్ర కోసం తాపత్రయపడుతున్నారో, అదే అల్లర్ల అనంతరం నితీష్ మోడీని ఆకాశానికెత్తారు. ప్రధాని పీఠంపై పోటీకి రావడంతో ఇప్పుడు మాట మార్చారు.

అద్వానీది అదే దారి

బిజెపి అగ్రనేత అద్వానీ కూడా మోడీని ఒకప్పుడు వెనుకేసుకు వచ్చిన నేత. ఆయనే ఇప్పుడు మోడీని వ్యతిరేకిస్తున్నారు. గోద్రా అల్లర్ల అనంతరం మోడీని తప్పించాలని నాటి ప్రధానమంత్రి వాజపేయి భావిస్తే అద్వానీ.. మోడీకి మద్దతుగా నిలబడ్డారు. ఇప్పుడు మోడీ ప్రధానమంత్రి, ప్రచార సారథ్య బాధ్యతలను అద్వానీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

దూరం పెరిగిందిలా...

2010 నుండే మోడీపై నితీష్‌క వ్యతిరేకత ప్రారంభమైందని చెప్పవచ్చు. బీహార్ ఎన్నికల సమయంలో స్థానిక మీడియా నితీష్‌తో పాటు మోడీని ఆకాశానికెత్తింది. ఇద్దరిని కలిపి భారీగా కటౌట్లు, పోస్టర్లు వెలిశాయి. దీంతో తన లౌకికవాద ప్రతిష్ట దెబ్బతింటుందని భావించిన నితీష్ యూ టర్న్ తీసుకున్నారు. అంతేకాకుండా ఇరువురు ప్రధాని పీఠంపై ఆశ పెట్టుకున్నారు. ఇది వారిద్దరి మధ్య దూరాన్ని మరింత పెంచింది.

ఆ మోడీ మిత్రుడు.. ఈ మోడీ శత్రువు

నరేంద్ర మోడీని మూడేళ్లుగా నితీష్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అదే బిజెపికి చెందిన బీహార్ బిజెపి నేత సుశీల్ కుమార్ మోడీ నితీష్ కుమార్‌కు మంచి స్నేహితుడు. నాలుగు దశాబ్దాలుగా వారి మైత్రి కొనసాగుతోంది. నరేంద్ర మోడీని చూపి నితీష్ బయటకు వెళ్లడంతో అదే మిత్రుడు సుశీల్ కుమార్ మోడీ.. జెడి(యు) పట్ల మండిపడ్డారు. నితీష్ ముఖ్యమంత్రిగా ఉండగా, సుశీల్ కుమార్ మోడి ఉపముఖ్యమంత్రిగా ఉన్నారు.

లాలు 'విడాకుల' చమత్కారం

ఎన్డీయే, జెడి(యు)ల విచ్ఛిన్నంపై ఆర్జెడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ వ్యంగ్యోక్తులు విసిరారు. ఇద్దరు విరుద్ధ భాగస్వాముల ప్రేమ వివాహానికి విడాకులుగా లాలూ అభివర్ణించారు. జెడియు, బిజెపిల మధ్య ఈ అసందర్భ విడాకులు వారి అపవిత్ర కలయికకు నిదర్శనమని, ఇది ఇద్దరు విరుద్ధ భాగస్వాముల ప్రేమ వివాహానికి విడాకుల్లాంటివన్నారు. కాగా గోద్రా అల్లర్ల సమయంలోనే రాంవిలాస్ పాశ్వాన్ ఎన్డీయే నుండి తప్పుకున్నారు.

అప్పుటినుండేం చేశారు?

గోద్రా అల్లర్ల సమయంలో నితీష్ కుమార్ కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా ఉన్నారని, ఆ తర్వాత కూడా మోడీని ఆయన ఆకాశానికెత్తారని, అలాంటి నితీష్ ఇప్పుడు తన రాజకీయ ప్రయోజనాల కోసమే ఎన్డీయే నుండి బయటకు వచ్చారని ఆరోపణలు గుప్పిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+