కిరణ్ ఇప్పుడు హీరో-విలన్, వైయస్‌లా!(పిక్చర్స్)

సీమాంధ్ర నేతలకు, ప్రజలకు, సమైక్యవాదులకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు హీరో అయ్యారు. గత శుక్రవారం కోర్ కమిటీ భేటీ సమావేశంలో తెలంగాణపై ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారని, అది తెలంగాణకు అనుకూలంగానే ఉంటుందనే ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. కోర్ కమిటీ భేటీకి ముందు తెలంగాణ కాంగ్రెసు నేతలు ధీమాగా కనిపించగా, సీమాంధ్ర నేతలు మాత్రం ఆందోళనలో ఉన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా కోర్ కమిటీ భేటీ ముగిసేంత వరకు ఉత్కంఠ కనిపించింది. తెలంగాణపై అధిష్టానం నిర్ణయం తీసేసుకుందని, రోడ్ మ్యాపులు కేవలం నామమాత్రమేననే వాదన వినిపించింది. అయితే కోర్ కమిటీలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రజెంటేషన్ కోర్ కమిటీ సభ్యుల మనసు మార్చేలా చేసిందంటున్నారు. విభజన జరిగితే ఇరు ప్రాంతాలకు ఎలా నష్టం, ఎంత నష్టం, కలిసింటే ఎలా లాభం అన్న విషయాలను వివరించారట.

కిరణ్ హీరో

కోర్ కమిటీలో తన ప్రజెంటేషన్ ద్వారా అధిష్టానం పెద్దల తెలంగాణ మైండ్‌ను మరల్చిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు సీమాంధ్ర నేతలు, సమైక్యవాదుల దృష్టిలో హీరో అయ్యారు.

వైయస్‌లా కిరణ్!

తెలంగాణకు అనుకూలంగా ఉన్న అధిష్టానాన్ని నాడు ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి వివిధ రూపాల్లో అడ్డుకున్నారని, ఇప్పుడు కిరణ్ అధిష్టానం నిర్ణయాన్ని అడ్డుకున్నారని అంటున్నారు.

బొత్స వంత!

తన ప్రజెంటేషన్ ద్వారా ఢిల్లీ పెద్దల తెలంగాణ మూడ్‌ను కిరణ్ మరల్చగా.. పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ రోడ్ మ్యాప్ ఆజ్యం పోసిందంటున్నారు. ఆయన కూడా విభజిస్తే నష్టం, కష్టం తప్పదని చెప్పారని చెబుతున్నారు. ఒక్క దామోదర రాజనర్సింహ మాత్రమే తెలంగాణకు అనుకూలంగా రోడ్ మ్యాప్ ఇచ్చారంటున్నారు.

తొక్క వలిచి నోట్లో పెట్టినట్లుగా...!

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన ప్రజెంటేషన్‌లో విభజనకు వ్యతిరేకంగా, సమైక్యానికి అనుకూలంగా బలమైన వాదన వినిపించారట. రాష్ట్ర బదులు భారీ ప్యాకేజీ ఇస్తే తెలంగాణకు మంచిదని కూడా చెప్పారట. ఏఏ రంగానికి, ఎన్నెన్ని నిధులు ఇస్తే ఎలా ఉంటుందని ఢిల్లీ పెద్దలకు అన్నీ సవివరంగా చెప్పారట.

ఆసక్తిగా విని...

కిరణ్ ప్రజెంటేషన్‌ను సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మిగతా కోర్ కమిటీ సభ్యులు ఆసక్తిగా విన్నారట. కిరణ్ వాదనతో ఏకీభవించడం వల్లనే అధిష్టానం తెలంగాణపై వెనక్కి తగ్గిందని సీమాంధ్ర నాయకులు భావిస్తున్నారు. అయితే వెనక్కి పోలేదని, కిరణ్ లేవెనత్తిన డౌట్స్‌ను క్లారిఫై చేసే పనిలో అధిష్టానం ఉందని, ఆ తర్వాత తెలంగాణ ఇవ్వడం ఖాయమని తెలంగాణ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

కిరణ్ చెప్పేటప్పుడు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ, ఇతర కోర్ కమిటీ సభ్యులు ఆసక్తిగా విన్నారట. అదే సమయంలో విభజన జరిగితే కాంగ్రెసు పార్టీకి రాజకీయంగా ఎలాంటి లాభం ఉండదని, ఇరు ప్రాంతాల్లో నష్టపోతుందని, కలిసుంటేనే ఎక్కువ స్థానాలు కైవసం చేసుకోవచ్చునని వివరించారట. కిరణ్ ప్రజంటేషన్ తర్వాత పెద్దలు తెలంగాణపై యూ టర్న్ తీసుకున్నారంటున్నారు.

కిరణ్ కారణంగా తెలంగాణ ఇచ్చే స్థితి నుండి అధిష్టానం ఒక్కసారిగా వెనక్కి వెళ్లడంతో సీమాంధ్ర నేతలకు, సమైక్యవాదులకు కిరణ్ ఇప్పుడు ఓ హీరో అయ్యారు. ఇప్పటికిప్పుడు తేల్చేస్తామని చెప్పిన అధిష్టానం.. కిరణ్ ప్రజెంటేషన్ తర్వాత మళ్లీ దానిని సాగదీసే వ్యూహానికి తెరలేపిందంటున్నారు. కోర్ కమిటీ భేటీ తర్వాత సిడబ్ల్యూసి, యూపిఏ మిత్రపక్షాలు, అఖిలపక్షం... ఇలా అధిష్టానం తెలంగాణపై సాగదీస్తుందని సీమాంధ్ర నేతలు బలంగా నమ్ముతున్నారట.

ఇదంతా కిరణ్ ప్రజెంటేషన్ కారణంగానే అని చెబుతున్నారు. కిరణ్ వాదనకు ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వాదన కూడా కొంత తోడ్పడిందంటున్నారు. బొత్స కూడా విభజన జరిగితే వచ్చే నష్టాలను వివరించారట. అయితే కిరణ్ ప్రజెంటేషన్ తర్వాత ఢిల్లీ పెద్దలు తెలంగాణపై వెనక్కి వెళ్లలేదని అయితే, కిరణ్ ప్రస్తావించిన అనుమానాలను సీమాంధ్ర నేతలకు ఎలా క్లియర్ చేయాలనే దానిపై తర్జన భర్జన పడుతుందంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+