టిపై హింట్: మాకెందుకు చెప్పలేదని నిలదీత

తెలంగాణ ఏర్పాటు నిర్ణయం తీసుకున్నట్లు ముందుగానే ముఖ్య నేతలందరికీ సమాచారం ఇచ్చినట్లు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ స్వయంగా చెప్పారని, ఆ విషయాన్ని తమకు ఎందుకు చెప్పలేదని బొత్సను ఒకింత ఆవేశంగా ప్రశ్నించారు. చెప్పి ఉంటే తమ ప్రయత్నాలు తాము చేసే వాళ్లమని, ఇప్పుడు నిర్ణయం తీసుకున్నాక ఏం చేసినా లాభం లేని పరిస్థితి ఉందని, తాము రాజీనామా చేసినా ఫలితం ఉండదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఆనంకు మంత్రి వట్టి వసంత్ కుమార్, ఇతరులు కూడా మద్దతు పలికారు. తాము మాత్రమే రాజీనామా చేస్తే సరిపోదని, మీరు కూడా రాజీనామా చేయాల్సిందేనని కిరణ్, బొత్సలకు సూచించారు. అప్పుడే అధిష్టానం దిగి వస్తుందని చెప్పారు. మంత్రులు పితాని సత్యనారాయణ, తోట నరసింహం వంటి వారు కూడా ముందే సమాచారం ఇస్తే తమ ప్రయత్నాలు తాము చేసుకునే వాళ్లమని వారితో చెప్పారు.
అయితే విభజనలో తాను భాగస్వామిని కాలేనని, తనకు బాగా ముందే తెలుసన్న దాంట్లో వాస్తవం లేదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వివరణ ఇచ్చారట. అయితే అందరం కలిస్తే 2009లో ప్రకటన మరో ప్రకటన వచ్చినట్లుగా ఇప్పుడు కూడా వచ్చే అవకాశాలు లేకపోలేదని, అందరం ఐక్యంగా ఉంటేనే సాధ్యమని, అందుకు కిరణ్, బొత్సలు కూడా సహకరించాలని కోరారట. విభజన తప్పని సరి అయితే హైదరాబాద్ పైన తమకు స్పష్టత కావాలని మరికొందరు డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది.
ముందే హింట్!
కాంగ్రెసు పార్టీ అధిష్టానం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే తమ ప్రయత్నాలు తాము చేసే వారిమని పలువురు ఎంపీలు, కేంద్రమంత్రులు కూడా చెబుతున్నారట. మరికొందరు మాత్రం ముందే హింట్ వచ్చిందని గుర్తు చేస్తున్నారు. పచ్చి సమైక్యవాది అయిన ఏలూరు పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివ రావు కేంద్ర జౌళి శాఖ మంత్రి అయ్యాక పలుమార్లు తెలంగాణకు అనుగుణంగా హింట్ ఇచ్చారని చెబుతున్నారు.
అంతేకాకుండా విభజన విషయంలో కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్‌కు పిసిసి చీఫ్ బొత్స సహకరిస్తున్నారని అందుకే, సమైక్యాంధ్ర సభలకు ఎంపీలు, మంత్రులు నిర్వహించే సభలకు బొత్స ఝాన్సీ హాజరు కాలేదని చెబుతున్నారు. మరికొందరు అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఇటీవల పలుమార్లు చెబుతూ వస్తున్నారని అంటున్నారు. ఇవన్నీ అధిష్టానం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుందనేందుకు హింట్స్ అని, వాటిని నేతలు గుర్తించక పోయి ఉంటారని అంటున్నారు. అయితే కావూరి వ్యాఖ్యల్లో మాత్రం స్పష్టంగా విభజనకు అనుకూలంగా ఉన్నట్లు కనిపించిందని గుర్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications