శ్రీశాంత్‌కు నిద్రలేని రాత్రులు, స్నానానికి నో

శనివారం పోలీసులు రెండోదఫా విచారణ చేసినప్పుడు శ్రీశాంత్ బోరున విలపించాడట. మొదటి రోజు సహచరులతో సెల్‌ను పంచుకున్నాడని కానీ, ఇప్పుడు అతడు ఒంటరిగా ఉన్నాడని, గత రెండు రోజులుగా శ్రీశాంత్ నిద్ర పోవడం లేదని పోలీసులు అధికారులు చెప్పారు.
శనివారం రెండోసారి ప్రశ్నించినప్పుడు అతను ఏడ్చేశాడని, ఒత్తిడిలో తరుచుగా ఏడుస్తున్నాడని చెప్పారు. తాము అతడిని ప్రశ్నించినప్పుడు మాములుగా ఉంటున్నప్పటికీ, ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్నాడని చెప్పారు. తానెక్కడున్నాననే విషయం గుర్తుకు వచ్చినప్పుడు ఆవేదన చెందుతున్నాడని చెప్పారు.
కాగా, ఐపిఎల్ బెట్టింగ్‌లో ఓ మరాఠా యాక్టర్ వ్యవహారంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పుకార్లు వినిపిస్తున్నాయి. శ్రీశాంత్ అరెస్టు అయిన సమయంలో అదే హోటల్లో ఓ మరాఠా యాక్టర్ ఉన్నట్లుగా పోలీసులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. అలాగే బాలీవుడ్ సెలిబ్రిటీల పాత్రలపై పోలీసులు అనుమానిస్తున్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
బుక్కీల నుంచి పోలీసులు బాలీవుడ్ సెలబ్రిటీల పేర్లను సేకరించినట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. సెలిబ్రిటీల నుంచి బెట్స్‌ను అంగీకరించే ముంబై పశ్చిమ శివారులోని పంటర్ల జాబితా పోలీసుల వద్ద ఉందట. ఐపియల్‌లో బెట్టింగ్ కాసేవారిలో పాత హీరో ఒకరు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. అతను నిర్మాతగా మారాడని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications