శ్రీశాంత్‌కి గర్ల్స్ పిచ్చి: ఫిక్సింగ్‌లో తెలుగు నిర్మాత

Sreeshanth
సంచలనం సృష్టించిన ఐపిఎల్ స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో ఓ టాలీవుడ్ నిర్మాతకు సంబంధం ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. విచారణకు హాజరు కావాలంటూ సదరు నిర్మాతకు సమాచారమిచ్చినట్లు పోలీసులు తెలిపారు. అతనిని త్వరలో ప్రశ్నిస్తామన్నారు. స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో అరెస్టైన పేసర్ శ్రీశాంత్ కంపెనీ 'ఎస్ 36'లో ఈ నిర్మాతకు భాగస్వామ్యం ఉన్నట్లుగా తెలుస్తోందని పోలీసులు అనుమానిస్తున్నారు.

శ్రీశాంత్‌కు చెందిన ఎస్ 36 కంపెనీ.. మినరల్ వాటర్, క్రీడా సామాగ్రి, దుస్తుల సరఫరా రంగంలో ఉంది. శ్రీశాంత్‌కు పలువురు మహిళా మోడళ్ల ఫోటోలు పంపించిన బాలీవుడ్‌కు చెందిన ఓ వ్యక్తిని పోలీసులు సోమవారం ప్రశ్నించారు. ఎస్ 36 కంపెనీ ప్రకటనల కోసం మోడళ్లను ఎంపిక చేయడానికి శ్రీశాంత్ కావాలంటే ఫోటోలు పంపించానని ఆ వ్యక్తి చెప్పినట్లుగా తెలుస్తోంది. శ్రీశాంత్ మెయిల్‌లో చాలా అమ్మాయిల ఫోటోలు ఉన్నాయి.

వీరిలో పలువురితో అతని సన్నిహితంగా మెలిగినట్లు తేలిందని మంబై పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలో జంటిల్మన్ గేమ్ క్రికెట్‌ని ఐపిఎల్ పంటర్ గేమ్‌గా మార్చేయగా, ఈ క్రమంలో శ్రీశాంత్ రాసలీలల పర్వానికి దిగినట్టు తేలింది. 23 ఏళ్ల వయస్సులో తారాజువ్వలా దూసుకు వచ్చిన ఈ కేరళ స్పీడ్‌స్టర్ , ఐపిఎల్ కాసుల వేట మోజులో అంతే వేగంగా అథఃపాతాళానికి పడిపోయాడు. స్పాట్ ఫిక్సింగ్‌పై పోలీసులు జరుపుతున్న దర్యాప్తులో శ్రీశాంత్ గురించి అనేక ఆసక్తికర అంశాలను వెలుగులోకి వస్తున్నాయి.

శ్రీశాంత్‌కు చెందిన ఎస్ 36లో అతని బావమరిది మధు బాలకృష్ణన్, స్నేహితులు దీపక్‌వారియా, దీపక్‌దాస్, ఆరిఫ్ మహమ్మద్, నిరన్ కుమార్, నారయణ్ ఉన్ని ఇందులో భాగస్వాములు. ఎస్ 36 ఓ మ్యూజిక్ బ్యాండ్ కూడా. కామన్‌వెల్త్ గేమ్స్ సందర్భంగా శ్రీశాంత్ మ్యూజిక్ బాండ్ ఒక థీమ్‌సాంగ్‌ను కూడా విడుదల చేసింది. అందులో శ్రీ శాంత్ కూడా పాడాడు. ఇక ఎస్36 పేరుతో ఏర్పాటైన కాస్టింగ్ కంపెనీలో కూడా శ్రీశాంత్ పార్ట్‌నర్.

వివిధ క్రీడా కార్యక్రమాలకు క్రీడా వస్తువులు, మినరల్ వాటర్, ఆహార పదార్థాల వంటివాటిని ఇది సరఫరా చేస్తుంది. ఈ కంపెనీలో శ్రీశాంత్‌కు భాగస్వామి అయిన వ్యక్తికి కూడా స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంతో సంబంధం ఉందని దర్యాప్తులో తేలింది. ఆ వ్యక్తి తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కూడా పేరున్నవాడని సమాచారం. అతడు నిర్మాత అని కొందరు చెబుతుండగా.. మరికొందరు కాస్టింగ్ డైరెక్టర్ అని చెబుతున్నారు.

శ్రీశాంత్ ల్యాప్‌టాప్‌లో అమ్మాయిల ఫొటోలున్నాయని, ఎస్ 36 కంపెనీ సభ్యులే శ్రీశాంత్‌కు ఆ ఫొటోలను మెయిల్ చేశారని పోలీసులు చెబుతున్నారు. క్రికెట్, సంగీతం సంగతేమోగానీ, శ్రీశాంత్‌కు అమ్మాయిల పిచ్చి ఉందని వారు అనుమానిస్తున్నారు. ముంబైలో శ్రీశాంత్ బసచేసిన హోటల్ గదుల్లో తనిఖీలు నిర్వహించినపుడు కండోమ్ ప్యాకెట్లు లభించినట్టు వారు వెల్లడించారు.

తాము వెళ్లే సరికి శ్రీశాంత్ మద్యం మత్తులో ఉన్నాడని, తమపైకి వస్తువులను విసిరేశాడని పేర్కొన్నారు. అజిత్ చండీలా అయితే తన క్రికెట్ కిట్‌లోనే రూ.20 లక్షల దాచుకుని దొరికిపోయాడని తెలిపారు. శ్రీశాంత్‌తో పాటు పట్టుబడిన ఇద్దరు క్రికెటర్లతో రాయల్ చాలెంజర్స్ సోమవారం ఐపిఎల్ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+