తెలంగాణకు పచ్చజెండా: హైదరాబాద్ మిస్టరీ?

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెసు పచ్చజెండా ఊపినట్లు కాస్తా బలమైన సంకేతాలే అందుతున్నాయి. ఇప్పటి పరిస్థితి అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెసు అధిష్టానం సుముఖంగా ఉన్నట్లు, రాష్ట్ర విభజనకు అవసరమైన సాంకేతిక లాంఛనాలను కూడా పూర్తి చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో రాష్ట్ర రాజధానిగా ఉన్న చారిత్రక నగరం హైదరాబాదు కీలకంగా మారింది. హైదరాబాదు కారణంగానే సీమాంధ్ర నాయకులు తెలంగాణను వ్యతిరేకిస్తున్నారనే అభిప్రాయం కూడా బలంగానే ఉంది.

హైదరాబాదుతో కూడిన తెలంగాణను మాత్రమే అంగీకరిస్తామని, హైదరాబాదు లేని తెలంగాణను తాము అంగీకరించబోమని పార్టీలకు అతీతంగా తెలంగాణ నాయకులు అంటున్నారు. హైదరాబాదు రాజధానిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలనేది తెలంగాణవాదుల బలమైన డిమాండ్. అయితే, హైదరాబాదును తెలంగాణకు రాజధానిగా ఉంచుతూనే మరో ఎత్తుగడకు కాంగ్రెసు అధిష్టానం తెర లేపుతోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

హైదరాబాదును ప్రత్యేక మండలిగా ఏర్పాటు చేస్తారనే ఊహాగానాలు కూడా చెలరేగుతున్నాయి. సింగపూర్ మాదిరిగా హైదరాబాదును ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నట్లు పుకార్లు చెలరేగుతున్నాయి. తెలంగాణ రాజధానిగా హైదరాబాదును నిర్ధారిస్తూ ప్రత్యేక మండలిగా ఏర్పాటు చేస్తారని అంటున్నారు. రంగారెడ్డి జిల్లాను, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలను కలిపి ప్రత్యేక మండలిగా ఏర్పాటు చేస్తారనే ప్రచారం సాగుతోంది.

Statehood for Telangana OK, Hyderabad is key

సీమాంధ్ర రాజకీయ నాయకులు పెద్ద యెత్తున పెట్టుబడులు పెట్టడం వల్ల వారి ఆస్తులకు రక్షణ కల్పించడానికి, హైదరాబాదును అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దడానికి, విదేశీ పెట్టుబడులకు అనుకూలంగా మార్చేందుకు ప్రత్యేక మండలిని ఏర్పాటు చేస్తారని అంటున్నారు. దేశంలోని కొన్ని ప్రధానమైన నగరాలను ఇలా ప్రత్యేకంగా తన ఆధ్వర్యంలో అంతర్జాతీయ నగరాలుగా తీర్చి దిద్ది, విదేశీ పెట్టుబడులకు అనుకూలంగా మార్చేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇందులో హైదరాబాదును మొదటి నగరంగా తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు.

అంటే, రాష్ట్ర విభజనను అవకాశంగా తీసుకుని హైదరాబాదును ప్రయోగాలకు కేంద్రంగా మార్చే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా, ప్రశాంత వాతావరణం నెలకొనేలా చేయడం ద్వారా విదేశీ పెట్టుబడులను హైదరాబాదుకు పెద్ద యెత్తున ఆహ్వానించవచ్చునని భావిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే, తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం రోడ్ మ్యాప్‌ను ప్రకటిస్తే తప్ప అసలు విషయం తెలిసేట్లు లేదు. అంతవరకు హైదరాబాదు ఓ మిస్టరీగానే ఉండిపోతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+