సాక్షిపై విందూ వదిన స్టోరీ: ధోనీ భార్యకి లింకేంటి?

చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ సతీమణి సాక్షి ఇప్పుడు వార్తల్లో వ్యక్తి అయ్యారు. మైదానంలో ధోనీ ఆడుతుంటే డిజైనర్ దుస్తుల్లో మెరవడంతో పాటు చెన్నై జట్టుకు మద్దతుగా నిలుస్తూ అందర్నీ ఆకట్టుకున్న సాక్షిపై ఇప్పుడు మరో కోణంలోను చర్చ కొనసాగుతోంది. బుకీగా అనుమానిస్తున్న ప్రముఖ బాలీవుడ్ నటుడు విందూ దారా సింగ్‌తో కిలిసి ఉన్న ఫోటోలు బయటపడటమే ఇందుకు కారణం.

స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలపై పేసర్ శ్రీశాంత్ అరెస్టైన విషయం తెలిసిందే. ఆయన ఓ యువతికి ఖరీదైన ఫోన్ కొనిచ్చినట్లుగా కూడా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. శ్రీశాంత్ ఫోన్ కొనిచ్చింది.. ధోనీ భార్య సాక్షి పరిచయం చేసిన అమ్మాయికేనట. ఆ యువతి పేరు కూడా సాక్షియే కావడం గమనార్హం. ఆమె పూర్తి పేరు సాక్షి జాలా. ఈమె సాక్షి ధోనికి స్నేహితురాలని తెలుస్తోంది. ధోనీ సతీమణే శ్రీశాంత్‌కు సాక్షి జాలాను పరిచయం చేశారట.

The tale of Two Sakshis

సాక్షి జాలా, సాక్షి ధోని క్లాస్‌మేట్స్ అని వార్తలు వస్తున్నాయి. ఔరంగాబాదులో ఇద్దరు ఒకే కళాశాలలో హోటల్ మేనేజ్‌మెంట్ చేసినట్లు చెబుతున్నారు. ఆ తర్వాత సాక్షి ధోనిని పెళ్లాడగా.. సాక్షి జాలా జైపూర్‌లోని ఓ పెద్ద హోటల్‌లో ట్రయినింగ్ పూర్తి చేసుకుంది. తర్వాత కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్‌లో ఎయిర్ హోస్టెస్‌గా చేరింది. ఐపిఎల్ 2 సందర్భంగా జైపూర్‌లో సాక్షి.. జాలాను శ్రీశాంత్‌కు పరిచయం చేసిందట. మరోవైపు ఓ ఫ్లైట్‌లో శ్రీశాంత్‌కు సాక్షి జాలాతో పరిచయం ఏర్పడిందని కూడా వార్తలు వస్తున్నాయి. సాక్షి జాలా, శ్రీశాంత్ స్నేహం ఇప్పటి వరకు కొనసాగుతోంది. పోలీసులు సాక్షి జాలాను ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి.

విందూతో కలిపిన ఫోటో విషయంపై...

చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌కు హాజరైన విందూ.. సాక్షితో కలిసి కనిపించాడు. ఆ తర్వాత కొన్ని పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో విందూ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయంటున్నారు. సాక్షినే తనను పిలిచి పక్కన కూర్చోమని చెప్పిందని చెప్పాడు. ఆ రోజు తనకు వేల సంఖ్యలో ఫోన్‌లు వచ్చాయని, సాక్షి పక్కన కూర్చోవడం తనకు అంతగా ఆకర్షణ తెస్తుందని ఊహించలేదని చెప్పాడట.

అసలు కెమెరామెన్ తమను పదే పదే ఎందుకు చూపించాడో అర్థం కాలేదని, చెన్నై ఫ్రాంఛైజీ యజమాని గురునాథ్ తనను మ్యాచ్‌కు ఆహ్వానించాడని, మ్యాచ్‌కు వెళ్లాక సాక్షి తన దగ్గరకు పిలిచిందని, అంతకుముందు ఐపిఎల్‌లో ధోనిని కలిశానని, సాక్షి దానిని గుర్తు చేసుకుందని, ఆమె తనకు వదిన లాంటిదని విందూ ఇంటర్వ్యూలో చెప్పాడట. సాక్షి జ్వాలా, విందూ వ్యవహారాలు సాక్షి ధోని వైపు దృష్టిని మళ్లించేలా ఉన్నాయంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+