జగన్ పార్టీ నుంచి అసెంబ్లీకి రాణిరుద్రమదేవి?

తెలంగాణ ఉద్యమానికి బాసటగా నిలుస్తారని భావించిన రాణి రుద్రమదేవి నిరుడు నవంబర్‌లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మతో బేటీ అయి అందరినీ ఆశ్చర్యపరిచారు. పార్టీ సభ్యత్వం కూడా తీసుకున్నారు. ఆమెను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నర్సంపేట ఇంచార్జీగా నియమించారు. దాంతో నర్సంపేట నుంచి ఆమె పోటీ చేయడం ఖాయమైపోయినట్లు చెబుతున్నారు.
నిజానికి, రాణి రుద్రమదేవికి రాజకీయానుభవం లేదు. కానీ ఆమె వెనక రాజకీయ దురంధరులు ఉండవచ్చుననే ఊహాగానాలు సాగుతున్నాయి. టీవీ యాంకర్‌గా ఆమె ప్రజలకు చిరపరిచితులయ్యారు. కానీ, టీ న్యూస్‌లో తెలంగాణకు అనుకూలంగా గొంతును ఇచ్చిన ఆమెను తెలంగాణ వ్యతిరేక పార్టీగా ముద్రపడిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి పోటీ చేస్తే ఆదరిస్తారా అనేది పెద్ద ప్రశ్న.
వాస్తవానికి తెలంగాణ ఉద్యోగుల పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారంటూ ఎబిఎన్ - ఆంధ్రజ్యోతి చానెల్‌ను వదిలేసి టీ న్యూస్‌లోకి రాణి రుద్రమదేవి ప్రవేశించారు. తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును ఆకాశానికెత్తారు. టీ న్యూస్ ద్వారా ఆమెకు ఓ సినిమా తారకు వచ్చినంత ఇమేజ్ వచ్చింది. తెలంగాణ ప్రజలు రాణిరుద్రమ దేవిని నర్సంపేట నియోజకవర్గంలో ఏ మేరకు ఆదరిస్తారో చెప్పడం కష్టమే.












Click it and Unblock the Notifications