చిరు నాయక్ అవుతారా?: ఎన్నో అనుమానాలు

అందుకు పలు కారణాలు ఉన్నాయని అంటున్నారు. ముఖ్యమంత్రి కావాలన్న కోరికతోనే చిరంజీవి ప్రజారాజ్యాన్ని స్థాపించారు. కానీ, 18 సీట్లతో సరిపెట్టుకున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి మృతి తర్వాత తన పార్టీని కాంగ్రెసులో కలిపేయడం ద్వారా ఇలా కాంగ్రెసు ద్వారా తన కలను నెరవేర్చుకోవాలనుకున్నారు. పార్టీలో అప్పుడే విలీనం చేసినందున 2014లో సిఎం అభ్యర్థిగా చిరంజీవికి కాంగ్రెసు పార్టీ అధిష్టానం హామీ ఇచ్చినట్లుగా ప్రచారం జరిగింది.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలు కూడా రేసులో ఉన్నారు. కిరణ్ తన ప్రభుత్వం 2014 వరకు ఉండేలా చూసుకుంటూనే ఆ తర్వాత కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు బొత్స కూడా అదే ప్రయత్నాల్లో ఉన్నారు. అయితే, వీరు ఎంతగా ప్రయత్నాలు చేసినా అధిష్టానం అండ ఉన్నవారే నాయక్ అవుతారు. 2014లో తానే సిఎం అభ్యర్థిగా చిరు ఇప్పటికే తన లాబీయింగ్ పూర్తి చేశారట!
అధిష్టానం అండ ఉన్నప్పటికీ పలు ప్రశ్నలు కాంగ్రెసు వారిని తొలుస్తున్నాయి. తెలంగాణ, వైయస్ రాజశేఖర రెడ్డి సెంటిమెంట్ కారణంగా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసు గెలుపు ఎంత మేరకు సాధ్యమని ప్రశ్నించుకుంటున్నారట. తెలంగాణపై ఇప్పటికీ కాంగ్రెసు తేల్చనందున రెండు ప్రాంతాల్లోనూ నష్టం జరిగే అవకాశముందని అంటున్నారు. తెలంగాణలో తెరాస, సీమాంధ్రలో జగన్ హవా కొనసాగడం ఖాయమనే అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారట.
మరోవైపు చిరంజీవి కూడా కేంద్ర మంత్రి అయ్యాక రాష్ట్ర రాజకీయాల్లో కనిపించడం తగ్గిందంటున్నారు. అంతేకాకుండా తెలంగాణపై కేంద్రం తేల్చకుండా ఎన్నికలకు వెళ్తే.. చిరును సిఎం అభ్యర్థిగా ప్రకటిస్తే.. తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెసుకు మరింత ఎదురుగాలి వీయడం ఖాయమంటున్నారు. చిరంజీవి తెలంగాణ వ్యతిరేకిగా ముద్రపడిన కారణంగా మిగిలిన నేతల కంటే ప్రభావం పడుతుందంటున్నారు.
చిరు వర్గం మంత్రి గంటా శ్రీనివాస రావు ఇటీవల సమైక్యాంధ్ర కోసం ఘాటైన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన వెనుక చిరంజీవి ఉన్నారా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. సెంటిమెంట్ కారణంగా కాంగ్రెస్ గెలుపుపై అనుమానాలు, గెలిచినా పోటీలో అనుభవజ్ఞులు ఉండటం, తెలంగాణను తేల్చకుండా చిరును సిఎంగా ప్రకటిస్తే ఆ ప్రాంత ప్రజలు ఆమోదిస్తారా? ఇలా కాంగ్రెసులోని చిరు వర్గాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయట.
-
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications