65 పేజీలు, 13 షెడ్యూల్స్: టి డ్రాఫ్ట్‌లో ఏముంది?
హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లును సభాపతి నాదెండ్ల మనోహర్ సోమవారం ఉదయం శాసన సభలో ప్రవేశ పెట్టారు. ముసాయిదా ప్రతులను సభ్యులకు పంచారు. ముసాయిదా బిల్లు మొత్తం 65 పేజీలతో ఉంది. డ్రాఫ్ట్ బిల్లును అసెంబ్లీ వెబ్‌సైట్లో కూడా పెట్టినట్లు చెప్పారు. తెలుగు, ఉర్దూ ప్రతులను కూడా అందుబాటులో ఉంచినట్లు చెప్పారు.
కాగా, 65 పేజీలతో ఉన్న డ్రాఫ్ట్ బిల్లులో 13 అంశాలు పొందుపర్చారు. షెడ్యూల్ 1లో రాజ్యసభ సభ్యులు, 2లో అసెంబ్లీ, పార్లమెంటు, మూడులో శాసన మండలి వివరాలను, నాలుగులో ఎమ్మెల్సీల వివరాలను, ఐదులో దళితుల వివరాలు, 6లో గిరిజనులు, 7లో నిధుల కేటాయింపు, 8లో పెన్షన్ల పంపిణీ వివరాలు, 9లో ప్రభుత్వ కార్పోరేషన్ కంపెనీల వివరాలు, 10లో ప్రభుత్వ సంస్థల వివరాలు, 11లో నదీ జలాల పంపిణీ, 12లో బొగ్గు తదితర సహజ వనరులు, 13లో విద్యా, వైద్యం, మౌళిక సదుపాయాలను పొందుపర్చారు.
తెలంగాణ డ్రాఫ్ట్ బిల్లు పూర్తి పాఠం ఇక్కడ క్లిక్ చేసి చదవండి

నదీ జలాల పంపిణీకి కేంద్ర జలవనరుల మంత్రి చైర్మన్‌గా ఉంటారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉంటారు. రెండు రాష్ట్రాలలోను శాసన మండలి కొనసాగనుంది. ఆంధ్రప్రదేశ్(సీమాంధ్ర) కొత్త రాష్ట్రంలో హైకోర్టు ఏర్పడే వరకు రెండు రాష్ట్రాలకు ఒకే హైకోర్టు ఉంటుంది. బిల్లు నేపథ్యంలో రెండు రాష్ట్రాలకు కేంద్ర బలగాలను పంపిస్తారు.












Click it and Unblock the Notifications