వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మెగా టార్గెట్..: పర్సనల్ విషయాలతో పవన్ వర్సెస్ వర్మ

జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శుక్రవారం తన గురించి మాట్లాడటంపై ప్రముఖ దర్శకులు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. పవన్... వర్మ వ్యక్తిగత విషయాలు మాట్లాడారు.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శుక్రవారం తన గురించి మాట్లాడటంపై ప్రముఖ దర్శకులు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. పవన్... వర్మ వ్యక్తిగత విషయాలు మాట్లాడారు.

వర్మ మీ గురించి పదే పదే ట్వీట్లు చేస్తున్నారు కదా.. ఏమంటారని విలేకరులు అడిగారు. దానికి పవన్ వ్యక్తిగత విషయాలు మాట్లాడారు. తనకు వర్మపై గౌరవం ఉందని చెబుతూ.. గతంలో ఆయన గురించి మాట్లాడలేదని, ఇకపైనా మాట్లాడబోనని చెప్పారు.

'దాదాపు 50 ఏళ్లు పైబడిన వ్యక్తి. ఆ మధ్యనే పెళ్లి చేసిన కూతురు. పైగా పెళ్లి అయిన కూతురిని పెట్టుకుని, పోర్నోగ్రఫీ ఫిలింస్ నేను కలెక్ట్ చేసుకుంటానని చెప్పే వ్యక్తి గురించి నన్ను ఏం మాట్లాడమంటారు? ఇక నేను ఏం చెప్పాలి? ఒకరోజు నన్ను ఎత్తొచ్చు, ఒకరోజు నన్ను తగ్గించొచ్చు. అన్నింటిపైనా మాట్లాడలేన'ని వ్యాఖ్యానించారు.

మూడు పెళ్లిళ్ల గురించి మాట్లాడలేదే

మూడు పెళ్లిళ్ల గురించి మాట్లాడలేదే

దీనిపై వర్మ ఘాటుగా స్పందించారు. తాను పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల గురించి మాట్లాడలేదని ఎద్దేవా చేశారు. తద్వారా వర్మ కూడా.. పవన్‌కు కౌంటర్‌గా ఆయన వ్యక్తిగత విషయాలు చెప్పారు.

అభిమానిగా మాట్లాడా

అభిమానిగా మాట్లాడా

తాను ఓ అభిమానిగా పవన్ కళ్యాణ్‌ మీద అంచనాలతో మాట్లాడానే కానీ, ఆయన వ్యక్తిగత విషయాలు తానెప్పుడూ మాట్లాడలేదని చెప్పారు. తన జీవితం, తన లైఫ్‌ స్టైల్‌, తాను ఆలోచించే విధానం దాచిపెట్టుకోకుండా తన పుస్తకం 'నా ఇష్టం'లో మొత్తం రాశానన్నారు.

నా దురదృష్టం

నా దురదృష్టం

పవన్‌ మీదున్న ఇష్టంతో నిజాయతీగా మాట్లాడానే కానీ, విమర్శించడానికి కాదన్నారు. దానిని ఆయన తెలుసుకోకపోవడం తన దురదృష్టం అన్నారు. పవన్‌కి, ఆయన భార్యకి, ఆయన కుటుంబానికి, జనసేన పార్టీకి, ఆయన అభిమానులకు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు. అయితే, పవన్ మూడు పెళ్లిళ్ల గురించి మాట్లాడి, తాను వ్యక్తిగత విషయాలు మాట్లాడలేదని చెప్పడం

ఖైదీ నెంబర్ 150

ఖైదీ నెంబర్ 150

అంతకుముందు, ఖైదీ నెంబర్ 150 పైన కూడా రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యానించడం, దాని పైన నాగబాబు మండిపడటం తెలిసిందే. విడుదలకు ముందు గౌతమీపుత్ర శాతకర్ణి ముందు ఖైదీ నెంబర్ 150ని తీసిపడేశారు. దీనిపై నాగబాబు తీవ్ర ఆగ్రహ వ్యక్తం చేశారు. నాగబాబు తనను టార్గెట్ చేయడంపై.. వర్మ కూడా ఘాటుగానే స్పందించారు.

చిరు, నాగబాబు.. ఇప్పుడు పవన్ పైన

చిరు, నాగబాబు.. ఇప్పుడు పవన్ పైన

చిరంజీవికి ఉన్నంత ఓపిక లేదని అభిప్రాయపడ్డారు. ఖైదీ నెంబర్ 150 విడుదల అనంతరం రామ్ గోపాల్ వర్మ ప్రశంసలు కురిపించడం వేరే విషయం. కానీ చిరంజీవిని, ఆ తర్వాత నాగబాబును వర్మ టార్గెట్ చేశారు. ఇప్పుడు పవన్ తన వ్యక్తిగత విషయాలు మాట్లాడేసరికి.. ఆయన కూడా మూడు పెళ్లిళ్ల అంశాన్ని లాగారు.

English summary
A few days ago at Megastar Chiranjeevi’s Khaidi No 150 Pre-Release event, we have seen Mega Brother, Nagababu lambasting Ram Gopal Varma for the comments he makes on Chiranjeevi and Mega family in his Twitter Account.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X