క్రిష్ మధ్యవర్తిత్వం: బీజేపీలోకి హీరో విశాల్?

చెన్నై: నడిగర్ సంఘం ఎన్నికల్లో హేమాహేమీలను మట్టికరిపించి అందరి దృష్టిని ఆకర్షించిన హీరో విశాల్‌పై బీజేపీ కన్నేసిందా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ ఏడాది తమిళనాడులో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడ క్రేజీ హీరోగా ఉన్న విశాల్‌ను తమ పార్టీలో చేర్చుకునే ప్రయత్నాలను ముమ్మరం చేసింది.

వచ్చే నెలలో ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలు తమిళనాట ఎన్నికల ప్రచార నిమిత్తం రానున్నారు. ఈలోగా విశాల్‌ను బీజేపీలోకి వచ్చేలా చూడాలని పార్టీ ముమ్మర ప్రయత్నాలను చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఇప్పటికే ఇద్దరు మధ్యవర్తులు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం నడిగర సంఘం ప్రధాన కార్యదర్శిగా ఉన్న విశాల్‌ను బీజేపీలో చేరేందుకు ఒప్పించే బాధ్యతలను చెన్నైకి చెందిన మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్‌కు అప్పగించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే పార్టీ నేత మురళీధరరావుతో భేటీ అయి శ్రీకాంత్ చర్చలు జరిపి ఆపై విశాల్ తో మాట్లాడినట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి.

క్రిష్ మధ్యవర్తిత్వం: బీజేపీలోకి హీరో విశాల్?

క్రిష్ మధ్యవర్తిత్వం: బీజేపీలోకి హీరో విశాల్?


చెన్నైలోని మైలాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం టికెట్‌ను సైతం విశాల్‌కు కేటాయించినట్లు సమాచారం. తెలుగు సంతతికి చెందిన విశాల్‌ బీజేపీలోకి చేరితే అటు తమిళ ప్రజలతో పాటు తెలుగు ప్రజలు కూడా బీజేపీకి మద్దతు ప్రకటిస్తారని కమలనాతులు భావిస్తున్నారు.

క్రిష్ మధ్యవర్తిత్వం: బీజేపీలోకి హీరో విశాల్?

క్రిష్ మధ్యవర్తిత్వం: బీజేపీలోకి హీరో విశాల్?


విశాల్‌తో ఇప్పటికే బీజేపీ ప్రతినిధులు రెండు మూడు సార్లు చర్చలు జరిపారు. ప్రస్తుతానికి తాను నడిగర సంఘం భవన నిర్మాణ పనుల్లో బిజీగా ఉన్నానని చెప్పినట్టు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. తమిళ రాజకీయాల్లో సినీతారల ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

క్రిష్ మధ్యవర్తిత్వం: బీజేపీలోకి హీరో విశాల్?

క్రిష్ మధ్యవర్తిత్వం: బీజేపీలోకి హీరో విశాల్?


గతంలో దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ కోసం బీజేపీ విశ్వప్రయత్నాలు చేసింది. అంతేకాదు బీజేపీ తరుపున తమిళ అభ్యర్ధిగా సీఎం అభ్యర్ధిగా ప్రకటిస్తామని హామీ కూడా ఇచ్చింది. అయితే రజనీకాంత్ బీజేపీ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించారు.

క్రిష్ మధ్యవర్తిత్వం: బీజేపీలోకి హీరో విశాల్?

క్రిష్ మధ్యవర్తిత్వం: బీజేపీలోకి హీరో విశాల్?


తనకు రాజకీయాలు ఇష్టం లేదని తేల్చి చెప్పారు. దీంతో పాపులారిటీ ఉన్న యువ హీరో విశాళ్ కోసం బీజేపీ తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇదిలా ఉంటే బీజేపీ తరఫున పోటీ చేసే సినీతారల పేర్ల జాబితాలో విసు, వైజయంతీమాల పేర్లు వినిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+