పిపిఎల రద్దు వెనక మరో కథ, ప్రతీకారమే?

హైదరాబాద్: విద్యుత్తు కొనుగోళ్ల ఒప్పందాలను (పిపిఎలను) రద్దు చేసి, తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్తు సరఫరాను తగ్గించాలనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోచన వెనక మరో కథ ఉన్నట్లు తెలుస్తోంది. విద్యుత్తు వివాదం ఇరు రాష్ట్రాల మధ్య తీవ్ర వివాదానికి దారి తీసింది. తమ రాష్ట్రంలోని థర్మల్, జల విద్యుత్కేంద్రాలు ఉత్పత్తి చేసే విద్యుత్తును తామే వాడుకుంటూ 460 మెగావాట్లు తెలంగాణకు కోత పెట్టాలని ఆంధ్రప్రదేశ్ పథక రచన చేసింది.

అయితే, ఆ వ్యవహారంలో కేంద్రం జోక్యం చేసుకుని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయాన్ని నిలిపేసింది. గతవారం నాగార్జునసాగర్ నుంచి కృష్ణా, గుంటూరు ప్రకాశం జిల్లాలకు పది టిఎంసిల నీటిని విడుదల చేయడానికి తెలంగాణ ప్రభుత్వం నిరాకరించింది. దీనికి ప్రతీకారంగానే పిపిఎలను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Andhra Pradesh's bid to snap power to Telangana

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయంపై తెలంగాణ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రాల పునర్వ్యస్థీకరణ బిల్లులోని అంశాన్ని గౌరవించాలని వారు డిమాండ్ చేశారు. విభజన సందర్భంగా విద్యుత్తు పంపిణీలో ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు.

అస్తులు, అప్పులు జానాభా, భౌగోళిక ప్రాతిపదికలపై పంచగా, విద్యుత్తును మాత్రం గత వినియోగం ప్రాతిపదికపై పంచాలనేది అన్యాయమని ఆయన అంటున్నారు. దీనివల్ల మొత్తం విద్యుదుత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 46.11 శాతం, తెలంగాణకు 53.89 శాతం దక్కుతుంది. హేతురహితమైన విద్యుత్తు పంపిణీ వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 1,700 మెగావాట్ల విద్యుత్తు నష్టం జరుగుతోందని, దీన్ని సవరించాలని తాను ప్రధాని నరేంద్ర మోడీని కోరుతానని చంద్రబాబు అన్నారు.

పిపిఎలను రద్దు చేయడం ద్వారా రాష్ట్ర పునర్వ్యస్థీకరణ బిల్లులో మాదిరిగా పంపకం తీరును దెబ్బ చంద్రబాబు ప్రయత్నించారు. దీనిపై తెలంగాణ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ప్రతిస్పందించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+