సిటీలో హడలెత్తిస్తున్న సెక్స్ సంబంధ హత్యలు

లైంగిక సంబంధాల కారణంగా హైదరాబాద్ నగరంలో హత్యలు తీవ్ర స్థాయిలో పెరుగుతున్నాయి. రాష్ట్రంలో లైంగిక సంబంధాలు, ప్రేమ వ్యవహారాల కారణంగా నిరుడు 445మంది ప్రాణాలు కోల్పోయారు. ఎన్‌సిఆర్‌బి గణాంకాల ప్రకారం రాష్ట్రంలో సుమారు 16 శాతం హత్యలకు లైంగిక సంబంధాలే కారణమని తెలుస్తోంది.
హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌లో రెండు రోజుల క్రితం వివాహేతర సంబంధం కారణంగా ప్రియుని సహాయంతో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని తన భర్తను హత్య చేయించింది. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కాగా మరో ఘటనలో ఆర్టీసీ డిపోలో డీజిల్ మెకానిక్‌గా పనిచేస్తున్న వెంకటేశ్వరరావుకు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని సౌజన్యకు కొన్ని వారాల క్రితం వివాహమైంది. అయితే తన ప్రియుడు జైదీప్ దేశితో కలిసి ప్రణాళిక ప్రకారం వెంకటేశ్వరరావును హత్య చేయించింది సౌమ్య. తల్లిదండ్రులు సౌజన్యకు ఇష్టం లేని వివాహం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.
ఇటీవలి కాలంలో హత్యలు అత్యధికంగా వివాహేతర సంబంధాల కారణంగానే జరుగుతున్నాయని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. వివాహం తర్వాత భార్యాభర్తలు కలిసి ఉండలేక ప్రేమించిన వారి సహాయంతో హత్యలకు పాల్పడతున్నట్లు తెలిపారు. వివాహేతర సంబంధాల గురించి భార్యకు లేదా భర్తకు తెలిసి వారు హత్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. నగరంలో ఇటీవల అనుమానం కారణంగా ఐదుగురు మహిళలు తమ భర్తల చేతిలో హత్య చేయబడ్డట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications