హైదరాబాద్‌లో బిగ్ బర్డ్: ఆంటోనోవ్ ఎఎన్‌-225 (ఫోటోలు)

హైదరాబాద్: రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రపంచంలోనే అతి భారీ కార్గో ఎయిర్‌క్రాఫ్ట్‌ ఆంటోనోవ్‌ ఎఎన్‌-225 మ్రియా తొలిసారిగా శంషాబాద్విమానాశ్రయంలో దిగడం ద్వారా జిహెచ్‌ఐఎఎల్‌ ఈ రికార్డును సృష్టించింది.

వివరాల్లోకి వెళితే ఉక్రెయిన్‌కు చెందిన ఈ భారీ కార్గో విమానం సెంట్రల్‌ ఆసియాలోని తుర్క్‌మెంబాషి నుంచి హైదరాబాద్‌ విమానాశ్రయానికి గురువారం తెల్లవారుజామున కోడ్‌ ఎఫ్‌ (ఎయిర్‌బస్‌ ఎ380కి సమానమైన) రన్‌వేపై లాండ్‌ అయ్యింది. ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానం అంటోనోవ్ ఏఎన్-225 మ్రియా ఇదే.

మ్రియా అంటే రష్యన్ భాషలో కల అని అర్థం. 117 టన్నుల బరువు ఉన్న విద్యుత్ జనరేటర్‌ను పశ్చిమ ఆస్ట్రేలియాలోని ఓ అల్యుమినియం మైనింగ్ కంపెనీకి తరలించేందుకు మంగళవారం చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రేగ్ నుంచి బయల్దేరింది. దీనిలో 133 టన్నుల బరువైన జనరేటర్ ఉంది.

దీంతో పాటు కొంతమంది ప్రయాణికులు కూడా ఉన్నారు. కాగా, భారత్‌లో ఏ విమానాశ్రయంలో లేని సదుపాయాలు ఇక్కడ ఉండటంతో ఆంటోనోవ్‌ హైదరాబాద్ విమానాశ్రయంలో ల్యాండ్‌ అయిందని ఇక్కడి విమానాశ్రయ అధికారులు తెలిపారు. దీని కోసం గత 3 వారాల నుంచి ఇక్కడ ఏర్పాట్లు చేశారు.

ప్రపంచంలోనే అతి భారీ కార్గో ఎయిర్‌క్రాఫ్ట్‌ ఆంటోనోవ్‌ ఎఎన్‌-225 మ్రియా రాక సందర్భంగా ఎయిర్ పోర్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి ఎస్‌జీకే కిశోర్ ఆధ్వర్యంలో విమనాశ్రయ అధికారులు అత్యాధునిక ఫైర్ ఇంజిన్లతో నీటిని చల్లి ఘనంగా స్వాగతం పలికారు. శనివారం హైదరాబాద్ నుంచి బయలుదేరి.. ఆదివారం ఉదయం 10 గంటలకు పెర్త్ చేరుకొంటుంది.

మార్గమధ్యంలో మారోసారి ఇండోనేషియా రాజధాని జకర్తాలో ఆగి ఇంధనాన్ని నింపుకొనున్నది. ఒక్కసారి ట్యాంక్ పూర్తిగా నింపుకొంటే ఏకధాటిగా 18 గంటలపాటు ప్రయాణించడం దీని ప్రత్యేకత. భారీ బరువుతో ప్రయాణిస్తున్నందున ప్రతీ నాలుగువేల కిలోమీటర్లకోసారి ఆగి ఇంధనాన్ని సమకూర్చుకుంటున్నది.

కలలోనే సాధ్యమనిపించే ఈ అసామాన్యమైన విమానాన్ని సోవియట్ రష్యా కాలంలో అంతరిక్ష అవసరాల కోసం 1988లో నిర్మించారు.

బిగ్ బర్డ్: ఆంటోనోవ్ ఎఎన్‌-225 మ్రియా

బిగ్ బర్డ్: ఆంటోనోవ్ ఎఎన్‌-225 మ్రియా

బిగ్ బర్డ్: ఆంటోనోవ్ ఎఎన్‌-225 మ్రియా 640 టన్నుల బరువు.. 32 చక్రాలు .. పొడవు 84 మీటర్లు. ఒక్కొ రెక్క పొడవు 88.4 మీటర్లు.

 బిగ్ బర్డ్: ఆంటోనోవ్ ఎఎన్‌-225 మ్రియా

బిగ్ బర్డ్: ఆంటోనోవ్ ఎఎన్‌-225 మ్రియా

ఆరు టర్బో ఫ్యాన్ ఇంజిన్లు 240 దేశాల్లో పర్యటించిన రికార్డు గంటకు 850 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం ఏకధాటిగా 18 గంటల పాటు ప్రయాణించే సామర్థ్యం

బిగ్ బర్డ్: ఆంటోనోవ్ ఎఎన్‌-225 మ్రియా

బిగ్ బర్డ్: ఆంటోనోవ్ ఎఎన్‌-225 మ్రియా

పది బ్రిటన్ యుద్ధ ట్యాంకులు సమానం ఓ ఫుట్‌బాల్ మైదానాన్ని ఆక్రమించేంతగా వెడల్పు

బిగ్ బర్డ్: ఆంటోనోవ్ ఎఎన్‌-225 మ్రియా

బిగ్ బర్డ్: ఆంటోనోవ్ ఎఎన్‌-225 మ్రియా

రష్యా వైమానిక దళంలో భాగంగా ఇది ఇటు అంతరిక్ష అవసరాలకు, ఇటు వైమానికి దళంలో విశేష సేవలు అందించింది. సోవియట్ యూనియన్ రష్యా ముక్కలైన తర్వాత ఈ విమానాన్ని చాలా రోజులు పట్టించుకోలేదు. హ్యాంగర్‌లోనే ఉండిపోయింది.

బిగ్ బర్డ్: ఆంటోనోవ్ ఎఎన్‌-225 మ్రియా

బిగ్ బర్డ్: ఆంటోనోవ్ ఎఎన్‌-225 మ్రియా

ఆ తర్వాత ఉక్రెయిన్‌కు చెందిన ఆంటోనోవ్ ఎయిర్ లైన్స్ దీనికి మరమ్మత్తులు చేసి వాణిజ్య సేవల్లో ప్రవేశపెట్టింది. అయితే ఇటువంటిదే మరొక విమానాన్ని నిర్మించాలని అనుకున్నా అది సాధ్యపడలేదు.

బిగ్ బర్డ్: ఆంటోనోవ్ ఎఎన్‌-225 మ్రియా

బిగ్ బర్డ్: ఆంటోనోవ్ ఎఎన్‌-225 మ్రియా

6 సూపర్‌ చార్జ్‌డ్‌ టర్బో ఫ్యాన్‌ ఇంజన్లు, 640 మెట్రిక్‌ టన్నుల ఎంటిఒడబ్ల్యు (మాగ్జిమమ్‌ టేకాఫ్‌ వెయిట్‌)తో కూడిన ఈ భారీ విమానం ఇప్పటికే 240 ప్రపంచ రికార్డులను తన ఖాతాలో వేసుకుంది.

బిగ్ బర్డ్: ఆంటోనోవ్ ఎఎన్‌-225 మ్రియా

బిగ్ బర్డ్: ఆంటోనోవ్ ఎఎన్‌-225 మ్రియా

విమానాశ్రయంలోని పొడవైన రన్‌వే, గ్రౌండ్‌ మానోవరింగ్‌ ఏరియా, సాంకేతిక సదుపాయాలు అద్భుతంగా ఉండటంతో ఆంటోనోవ్‌ ల్యాండింగ్‌కు హైదరాబాద్‌ను ఎంచుకుందని ఆయన చెప్పారు.

బిగ్ బర్డ్: ఆంటోనోవ్ ఎఎన్‌-225 మ్రియా

బిగ్ బర్డ్: ఆంటోనోవ్ ఎఎన్‌-225 మ్రియా

అత్యంత పొడవైన ఈ కార్గో విమానం దిగేందుకు అనువైన పరిస్థితులు ప్రపంచంలోని కొన్ని విమానాశ్రయాల్లో ఉన్నాయని, ఇందులో హైదరాబాద్‌ విమానాశ్రయం ఒకటికావటం ఎంతో సంతోషాన్నిస్తోందని కిశోర్‌ అన్నారు.

బిగ్ బర్డ్: ఆంటోనోవ్ ఎఎన్‌-225 మ్రియా

బిగ్ బర్డ్: ఆంటోనోవ్ ఎఎన్‌-225 మ్రియా

ఆంటోనోవ్‌ వంటి భారీ కార్గో విమానం ల్యాండ్‌ కావటం ద్వారా దక్షిణాసియా ప్రాంతం, భారతలోనే హైదరాబాద్‌ విమానాశ్రయం లాజిస్టిక్‌ హబ్‌గా ఎదిగే అవకాశాలను మరింత మెరుగుపరుచుకోగలిగిందని తెలిపారు.

బిగ్ బర్డ్: ఆంటోనోవ్ ఎఎన్‌-225 మ్రియా

బిగ్ బర్డ్: ఆంటోనోవ్ ఎఎన్‌-225 మ్రియా

ఇరవై నాలుగు గంటల పాటు హైదరాబాద్‌ విమానశ్రయంలో ఉండనున్న ఆంటోనోవ్‌.. ఇక్కడి నుంచి ఇండోనేషియా రాజధాని జకార్తా.. అక్కడి నుంచి తుది గమ్యస్థానం ఆస్ట్రేలియాలోని పెర్త్‌కు చేరుకోనుంది.

బిగ్ బర్డ్: ఆంటోనోవ్ ఎఎన్‌-225 మ్రియా

బిగ్ బర్డ్: ఆంటోనోవ్ ఎఎన్‌-225 మ్రియా

భారత్‌లో ఆంటోనోవ్‌ ప్లాట్‌ఫామ్స్‌.. అసెంబ్లింగ్‌, మాన్యుఫ్యాక్చర్‌, ఎంఆర్‌ఒ కోసం ఉక్రెయిన్‌కు చెందిన ఆంటోనోవ్‌తో రిలయన్స్‌ డిఫెన్స్‌ ఒప్పందం కుదుర్చుకుంది.

బిగ్ బర్డ్: ఆంటోనోవ్ ఎఎన్‌-225 మ్రియా

బిగ్ బర్డ్: ఆంటోనోవ్ ఎఎన్‌-225 మ్రియా

భారత్‌లోని వాణిజ్య, మిలిటరీ మార్కెట్‌ అవసరాలకు ఈ ఒప్పందం దోహదం చేకూరుస్తుందని రిలయన్స్‌ తెలిపింది. హెచ్‌ఎఎల్‌ 50-80 సీట్ల ప్యాసింజర్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ రూపకల్పనతో పాటు ఇతరత్రా అవసరాలను ఈ ఒప్పందం తీరుస్తుందని తెలిపింది.

బిగ్ బర్డ్: ఆంటోనోవ్ ఎఎన్‌-225 మ్రియా

బిగ్ బర్డ్: ఆంటోనోవ్ ఎఎన్‌-225 మ్రియా

మేక్‌ ఇన్‌ ఇండియాను విజయవంతం చేసేందుకు ఆంటోనోవ్‌తో ఒప్పందం దోహదపడుతుందని రిలయన్స్‌ డిఫెన్స్‌ వెల్లడించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+