టిడిపి ఎమ్మెల్యేలని టెన్షన్ పెడుతున్న బాబు ర్యాంక్‌లు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు... ఎమ్మెల్యేలు, మంత్రుల పని తీరుకు ర్యాంకులు ఇచ్చి వారిలో టెన్షన్ పెంచారని అంటున్నారు. ఈ ర్యాంకుల పైన టిడిపి నేతల్లో చర్చ జరుగుతోందని తెలుస్తోంది. ర్యాంకింగ్‌లో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు మొదటి ర్యాంక్ వచ్చింది.
అయితే, టిడిపిలో ఇప్పుడు ఏ ఇద్దరు కలిసినా ర్యాంక్ గురించి చర్చించుకుంటున్నారని తెలుస్తోంది. ర్యాంక్ తక్కువగా వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఏ కారణం వల్ల ఇలా జరిగిందోనని తమ పని తీరును, నియోజకవర్గాల్లో పథకాల పనితీరును మదింపు చేసుకుంటున్నారు.
మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరును సమీక్షిస్తూ, సర్వే చేయించిన అనంతరం చంద్రబాబు ర్యాంకులు ఇచ్చారు. ఇవి ఇప్పుడు వారిలో గుబులు పుట్టిస్తున్నాయి.

కొద్ది రోజుల క్రితం విజయవాడలో జరిగిన పార్టీ సమావేశంలో చంద్రబాబు ఎవరికి వారికి వ్యక్తిగతంగా ఈ ర్యాంకుల వివరాలను అందజేశారు.
చంద్రబాబు చేయించిన సర్వే అనంతరం... సదరు ప్రజాప్రతినిధి పనితీరుపై ప్రజల అభిప్రాయంతో పాటు, జిల్లాలో అతని ర్యాంకు ఎంతన్న విషయాన్ని ప్రతి ఒక్కరికీ వ్యక్తిగతంగా అందించారు. ర్యాంకులు తక్కువగా వచ్చిన వారు అసలెందుకిలా జరిగిందో తెలియడం లేదని వాపోతున్నారు.
ప్రజాప్రతినిధి పనితీరుపై ప్రజల్లో ఉన్న అభిప్రాయం టిడిపి వారికి మాత్రమే ఇచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ముఖ్యమైన ఎనిమిది సంక్షేమ పథకాల అమలుపై ఆ నియోజకవర్గంలో ప్రజల సంతృప్తి లేదా అసంతృప్తి ఏ స్థాయిలో ఉందనేది రెండో ర్యాంక్. ఇది టిడిపి, వైసిపి ఎమ్మెల్యేలకు ఇచ్చారు.
ఇందులో వైసిపి అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి 131వ ర్యాంక్ వచ్చింది. తమ పార్టీ అధ్యక్షులు జగన్‌కు 131వ ర్యాంక్ ఇవ్వడంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అప్పుడే మండిపడ్డారు. అయితే, పులివెందులలో జగన్ ఏం చేశారో చెప్పాలని టిడిపి సవాల్ విసిరింది.
-
AP Pensions: ఆ పెన్షన్లు తీసేశాం-తేల్చేసిన సర్కార్ ..! -
YS జగన్ ఎమోషనల్: వైసీపీ ఆవిర్భావ వేళ కీలక ప్రకటన -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications