వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్ మైండ్‌గేమ్: బాబు ఇంటి వద్ద భద్రత(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు తెలుగు రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. ఈ కేసులు ఎప్పుడు ఏ మలుపు తిరుగుతున్నాయో అర్థం కాని పరిస్థితి.

ఉమ్మడి రాజధాని హైదరాబాదులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంటి వద్ద భద్రత పెంచారు. ప్రస్తుతం ఉన్న సిబ్బందితో పాటు అదనంగా మరో 60 మదిని నియమించారు.

గ్రేహౌండ్స్, ఆక్టోబస్ విభాగాల నుంచి చెరో 30 మందిని భద్రత కోసం వినియోగిస్తున్నారు. ఇప్పటికే ఉన్న ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్, బెటాలియన్ సిబ్బందిని అలాగే కొనసాగిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో హైటెన్షన్

తెలుగు రాష్ట్రాల్లో హైటెన్షన్

ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు తెలుగు రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. ఈ కేసులు ఎప్పుడు ఏ మలుపు తిరుగుతున్నాయో అర్థం కాని పరిస్థితి.

 తెలుగు రాష్ట్రాల్లో హైటెన్షన్

తెలుగు రాష్ట్రాల్లో హైటెన్షన్

ఉమ్మడి రాజధాని హైదరాబాదులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంటి వద్ద భద్రత పెంచారు. ప్రస్తుతం ఉన్న సిబ్బందితో పాటు అదనంగా మరో 60 మదిని నియమించారు.

 తెలుగు రాష్ట్రాల్లో హైటెన్షన్

తెలుగు రాష్ట్రాల్లో హైటెన్షన్

గ్రేహౌండ్స్, ఆక్టోబస్ విభాగాల నుంచి చెరో 30 మందిని భద్రత కోసం వినియోగిస్తున్నారు. ఇప్పటికే ఉన్న ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్, బెటాలియన్ సిబ్బందిని అలాగే కొనసాగిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో హైటెన్షన్

తెలుగు రాష్ట్రాల్లో హైటెన్షన్

ఓటుకు నోటు వ్యవహారంపై మంగళవారం హైడ్రామా నడిచింది. చంద్రబాబు, ఇద్దరు ఎంపీలకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉందంటూ ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో దుమారం లేచింది.

 తెలుగు రాష్ట్రాల్లో హైటెన్షన్

తెలుగు రాష్ట్రాల్లో హైటెన్షన్

క్రమంగా తెలుగు రాష్ట్రాల మధ్య జగడంగా మారుతోన్న ఓటుకు నోటు కుంభకోణంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాల ఎత్తులకు పైఎత్తులు వేస్తూ పావులు కదిపాయి.

 తెలుగు రాష్ట్రాల్లో హైటెన్షన్

తెలుగు రాష్ట్రాల్లో హైటెన్షన్

మొత్తం వ్యవహారానికి రాజభవన్ కేంద్ర బిందువుగా మారడంతో వ్యవహారం ముదిరిపాకాన పడిందన్న అంచనాలు వెలువడ్డాయి.

 తెలుగు రాష్ట్రాల్లో హైటెన్షన్

తెలుగు రాష్ట్రాల్లో హైటెన్షన్

గత కొన్ని రోజులుగా ఉదంతంపై సాగుతోన్న దర్యాప్తులో భాగంగా మంగళవారం ఏ క్షణంలోనైనా చంద్రబాబుకు తెలంగాణ ఏసీబీ నోటీసులు జారీవచ్చని విస్తృత ప్రచారం సాగడంతో రాజకీయం వేడెక్కింది.

 తెలుగు రాష్ట్రాల్లో హైటెన్షన్

తెలుగు రాష్ట్రాల్లో హైటెన్షన్

దీనికితోడు చంద్రబాబు ఇంటి వద్ద పోలీసు భద్రత పెరగడంతో ఏదో జరుగుతుందనే భావనకు బలం చేకూరింది. కేసీఆర్‌తో డీజీపీ అనురాగశర్మ, ఏసీబీ డైరెక్టర్ జనరల్ ఎకె ఖాన్ కీలక సమావేశం నిర్వహించారు.

తెలుగు రాష్ట్రాల్లో హైటెన్షన్

తెలుగు రాష్ట్రాల్లో హైటెన్షన్

ముఖ్యమంత్రి సమావేశం నుంచి నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ నరసింహన్‌తో సమావేశమయ్యారు. దీంతో, ఏక్షణంలోనైనా చంద్రబాబుకు ఏసీబీ నోటీసులిచ్చే అవకాశం ఉందంటూ విస్తృత ప్రచారం సాగింది.

 తెలుగు రాష్ట్రాల్లో హైటెన్షన్

తెలుగు రాష్ట్రాల్లో హైటెన్షన్

ఈ పరిణామాల సమయంలోనే.. ఏసీబీ నోటీసులిస్తే తదనంతర పరిణామాలు ఎలా ఎదుర్కొవాలన్న దానిపై ఆంధ్ర సిఎం చంద్రబాబు సహచర కీలక మంత్రులు, రాష్ట్ర డీజీపీ జెవి రాముడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావుతో అత్యవసరంగా సమావేశమయ్యారు.

 తెలుగు రాష్ట్రాల్లో హైటెన్షన్

తెలుగు రాష్ట్రాల్లో హైటెన్షన్

చంద్రబాబు ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలను రద్దు చేసుకొని మంత్రులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. కేబినెట్ సబ్ కమిటీ సమావేశాన్ని సైతం రద్దు చేసుకొని కొందరు మంత్రులు బాబువద్దకు రావడంతో, ఏదో జరుగుతోందనే అనుమానాలకు మరింత బలం చేకూరింది.

తెలుగు రాష్ట్రాల్లో హైటెన్షన్

తెలుగు రాష్ట్రాల్లో హైటెన్షన్


అనంతరం ఆంధ్ర డిజిపి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌తో సమావేశమయ్యారు. ఇలా ఆంధ్ర, తెలంగాణ ఉన్నతాధికారులు ఒకరి తర్వాత ఒకరు వరుసగా గవర్నర్‌ను కలవడంతో ఏక్షణంలో ఏం జరుగబోతుందోనన్న తీవ్ర ఉత్కంఠ పరిస్థితులు ఉమ్మడి రాజధానిలో చోటుచేసుకున్నాయి.

 తెలుగు రాష్ట్రాల్లో హైటెన్షన్

తెలుగు రాష్ట్రాల్లో హైటెన్షన్

ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారుల భేటీల అనంతరం సాయంత్రం హైకోర్టు చీఫ్ జస్టిస్ సైతం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ నరసింహన్‌ను కలవడంతో హైడ్రామా తారాస్థాయికి చేరింది.

తెలుగు రాష్ట్రాల్లో హైటెన్షన్

తెలుగు రాష్ట్రాల్లో హైటెన్షన్

ఇలాఉండగా ఓటుకు నోటు వ్యవహారంలో ఏ క్షణంలోనైనా చంద్రబాబుకు తెలంగాణ ఏసీబీ నోటీసులు జారీ చేయనుందన్న ప్రచారం నేపథ్యంలో తెలంగాణ సచివాలయం లోపల వెలుపల, అలాగే అవినీతి నిరోధకశాఖ కేంద్ర కార్యాలయం వద్ద, టీడీపీ కార్యాలయం, చంద్రబాబు నివాసం వద్ద పెద్దఎత్తున పోలీసు బలగాలను మోహరించారు.

సీఎం రమేష్

సీఎం రమేష్

ఓటుకు నోటు కేసులో తన బ్యాంకు అకౌంట్ నుంచే డబ్బులు డ్రా చేసినట్లు ప్రచారం చేస్తూ మైండ్ గేమ్ ఆడుతున్నారని టీడీపీ రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్ అన్నారు.

సీఎం రమేష్

సీఎం రమేష్

తనకు నోటీసులు రానున్నట్లు చేస్తున్నారని సీఎం రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజంగా తాను బ్యాంకు నంచి రూ.50 లక్షలు డబ్బులు డ్రా చేసిన సమకూర్చినట్లయితే ఓటుకు నోటులో ఫోన్ ట్యాపింగ్ టేపులు విడుదల చేసినట్లుగానే, తాను డబ్బులు డ్రా చేసినట్లు వీడియో ఫుటేజీలు మీడియాకు విడుదల చేయవచ్చు కదా అని సవాల్ చేశారు.

సీఎం రమేష్

సీఎం రమేష్

ఈ సంఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. కాగా, సిఎం రమేష్ తన ఇంటి వద్ద దిష్టి తీయించాకున్నారు. ఆయన రాక సందర్భంగా ఇంటి పనివారు గుమ్మడి కాయ కొట్టి దిష్టి తీశారు. కొబ్బరి కాయ కొట్టారు. ఇంటి బయట అటు ఇటు దీపాలను వెలిగించారు. సీఎం రమేష్‌కు ఏం కాకూడదని కోరుకుంటూ వారు ఈ పని చేశారని అంటున్నారు.

English summary
AP security tightened at Chandrababu residence
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X