గౌను తొలగించిన షారుక్ ఖాన్, దానిపై విమర్శలు
మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయంలో సోమవారం నాడు బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్‌కు గౌరవ డాక్టరేట్ ఇచ్చారు.
హైదరాబాద్: మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయంలో సోమవారం నాడు బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్‌కు గౌరవ డాక్టరేట్ ఇచ్చారు. ఈ సందర్భంగా సంప్రదాయాలను పక్కన పెట్టినందుకు పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
షారుక్ ఖాన్‌కు డాక్టరేట్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన కోటును, క్యాప్‌ను పెట్టుకున్నారు. అయితే, ఓ వైపు కన్వోకేషన్ జరుగుతుండగానే షారుక్ ఖాన్ తన క్యాప్‌ను తీసి పక్కన పెట్టారు. ఆ తర్వాత కాసేపటికి కన్వోకేషన్ గౌనును విప్పారు.
బాగా ఉక్కపోతగా ఉన్నందున విప్పేశారు. అయితే, షారుక్ ఖాన్ చాలాసేపు దానిని ధరించే ఉన్నారు. కానీ ఆ తర్వాత కాసేపు తొలగించారు. మరోవైపు, షారుక్ ఖాన్ వెళ్తున్న సమయంలో యూనివర్సిటీ ఛాన్సులర్ జఫర్ యూనస్ సరేశ్వాలా కార్యక్రమాన్ని కాసేపు ఆపారు.
షారుక్ ఖాన్ మాట్లాడిన తర్వాత ఆయన వెళ్లిపోతున్న సమయంలో ఛాన్సులర్ పోడియం దిగి వచ్చారు. ఆ తర్వాత తిరిగి కార్యక్రమం కొనసాగించారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయని చెబుతున్నారు.

డాక్టరేట్ పైన షారుక్ ఖాన్
తాను ఈ డాక్టరేట్‌కు అర్హుడినో కాదో తనకు తెలియదని, తన తల్లి పుట్టిన హైదరాబాదులో దీనిని అందుకోవడం చాలా సంతోషంగా ఉందని ప్రముఖ నటుడు షారుక్ ఖాన్ సోమవారం అన్నారు.

ఖాన్‌కు డాక్టరేట్
హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం ఆయనకు సోమవారం నాడు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఉర్దూ వర్శిటీ ఆరో స్నాతకోత్సవం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి షారుక్ ఖాన్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

డాక్టరేట్ ప్రదానం చేశారు
ఈ సందర్భంగా షారుక్ ఖాన్‌కు విశ్వవిద్యాలయ ఛాన్సులర్ జాఫర్ యూనస్ డాక్టరేట్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా షారుక్ మాట్లాడారు. తనకు డాక్టరేట్ రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. విద్య, ఉర్దూ భాష అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు.

తన తల్లి హైదరాబాదులో జన్మించిందని షారుక్
తన తల్లి హైదరాబాద్‌లో జన్మించిందన్నారు. తన తండ్రి ఉర్దూ పండితుడన్నారు. ఎదుటివారికి ఎప్పుడూ తక్కువ అంచనా వేయవద్దని, జీవితంలో ముందుకెళ్లేటప్పుడు ఒక్కోసారి తల వంచాల్సి వస్తుందని, టైప్ రైటర్‌లో తప్పులు దొర్లితే సరిదిద్దుకోవడం కష్టమని, అందుకే టైప్ చేసే సమయంలో ఆలోచించి జాగ్రత్తగా టైప్ చేయాలని, అదేవిధంగా జీవితంలో ఏం చేసినా ఆలోచించి జాగ్రత్తగా చేయాలన్నారు.

సరిదిద్దుకోలేం..
ఏదైనా తప్పు చేశాక సరిదిద్దుకోవడం కంటే ముందే జాగ్రత్త పడితే మంచిదన్నారు. తన తల్లి పుట్టిన హైదరాబాదులో డాక్టరేట్ అందుకోవడం మరింత ఆనందమని, తన తల్లిదండ్రులు ఉంటే ఎంతో సంతోషించేవారని షారుక్ ఖాన్ అన్నారు.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications