మహాభారతంలో ‘లక్క ఇల్లు’: సొరంగం తవ్వకాలతో వెలుగులోకి వాస్తవ చరిత్ర
మహాభారతంలో లక్క గృహం అంశం కీలక ఘట్టమే. పాండవులను సజీవ దహనం చేయాలన్న కుట్రతో కౌరవులు లక్క ఇంటిని నిర్మించడం...
Recommended Video

మీటర్: మహాభారతంలో లక్క గృహం అంశం కీలక ఘట్టమే. పాండవులను సజీవ దహనం చేయాలన్న కుట్రతో కౌరవులు లక్క ఇంటిని నిర్మించడం... దాన్నుంచి సొరంగమార్గం ద్వారా పాండవులు తప్పించుకోవడం.. ఇదంతా తెలిసిన విషయమే.
అయితే, ఇల్లు దేశంలో ఏ ప్రాంతంలో ఉండేదనేది మరింత ఆసక్తికరం. దీనిపై ఏళ్ల తరబడి పురావస్తు నిపుణులు, చరిత్రకారులు చెబుతున్న అనేక అంశాల ఆధారంగా 'చరిత్ర'ను వెలికితీసేందుకు భారత పురావస్తు శాఖ (ఏఎస్‌ఐ) నిర్ణయించింది. ఈ నేపథ్యంలో తవ్వకాలు ప్రారంభిస్తే చారిత్రక వాస్తవాలెన్నో వెలుగు చూస్తాయని అంచనా వేస్తున్నారు.

లక్క ఇంటి ఆనవాళ్లు..
ఉత్తర్‌ప్రదేశ్ బాగ్‌పట్‌లోని బర్నావాలోనే లక్క ఇల్లు, సొరంగమార్గం ఉన్నట్లు భావిస్తున్న నేపథ్యంలో ఇక్కడ తవ్వకాలకు ఆమోదించింది. ఈ ప్రాంతంలోనే లక్కఇంటి సన్నివేశానికి సంబంధించిన ఆనవాళ్లు కనిపించడంతో ఏఎస్‌ఐ కీలక నిర్ణయం తీసుకుంది. విస్తృత అధ్యయనం అనంతరం ఢిల్లీ ఎర్రకోటలోని పురావస్తు సంస్థ (ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆర్కియాలజీ) పాటు తమ శాఖకు తవ్వకాలకు గాను అనుమతిచ్చినట్లు ఏఎస్‌ఐ డైరెక్టర్ (తవ్వకాలు) జితేందర్‌నాథ్ వెల్లడించారు.

పాండవుల ఐదూళ్లలో ఒకటి..
ఈమేరకు డిసెంబరు మొదటి వారంలో ప్రారంభించి 3 నెలల పాటు తవ్వకాలు జరుపుతారు. కాగా, ఆనాడు లక్కఇల్లు నిర్మాణం జరిగినట్లు భావిస్తున్న బర్నావా ప్రాంతానికి విశేష ప్రాశస్త్యం ఉంది. వర్ణావ్రత్‌గా పిలిచే ప్రాంతం క్రమేపీ బర్నావాగా మారింది. ఇది పాండవులు తమకు ఇమ్మని అడిగిన ఐదు ఊళ్లలో ఒకటని పురావస్తు నిపుణులు చెబుతుంటారు.

జాతిరత్నాలు, కిరీటాలు బయటపడ్డాయి..
గతంలో ఇక్కడికి సమీపంలోని చందాయాన్, సినౌలీ ప్రాంతాల్లో జరిపిన తవ్వకాల్లో భారీగా అస్తిపంజరాలు, కుండలు, జాతిరత్నాలతో కూడిన కిరీటం వంటివి బయటపడ్డాయి.

వెలుగులోకి చారిత్రక వాస్తవాలు..
అలాగే ఈ ప్రాంతంలోని మట్టిదిబ్బలోపల సొరంగ భాగం ఉండటంతో అది పాండవులు తప్పించుకున్న మార్గం అయి ఉండవచ్చని భావిస్తున్నారు. అనేక ఒంపులుండటం వల్ల ఆ సొరంగం లోపలికి ఇంతవరకూ ఎవరూ వెళ్లే సాహసం చేయలేదు. ఈ నేపథ్యంలో తవ్వకాలు ప్రారంభిస్తే చారిత్రక వాస్తవాలెన్నో వెలుగు చూసే అవకాశాలున్నాయి.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications