ఇస్లామిక్ స్టేట్ ట్విట్టర్ ఖాతా బెంగళూరు ఎగ్జిక్యూటివ్ చిక్కాడా?
బెంగళూరు: సిరియా ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) ట్విట్టర్ ఖాతాను నడిపిస్తున్న బెంగళూరు ఎగ్జిక్యూటివ్ పోలీసులకు చిక్కినట్లు వార్తలు వస్తున్నాయి. మెహిదీగా చానెల్ 4 న్యూస్ బయటపెట్టిన ఆ బెంగళూరు ఎగ్జిక్యూటివ్‌ను పోలిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు చెబుతున్నారు. @ShamiWitness ద్వారా ఇస్లామిక్ స్టేట్‌లోకి నియామకాలు జరుపుతున్నది ఎవరనేది తెలుసుకునే నేపథ్యంలో ఓ వ్యక్తిని బెంగుళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
అయితే, పోలీసులు మాత్రం శుక్రవారంవరకు దాన్ని ధ్రువీకరించడం లేదు. తమ బృందం అతని కోసం గాలిస్తోందని మాత్రం బెంగళూరు పోలీసు కమిషనర్ ఎంఎన్ రెడ్డి చెప్పారు. కేసుకు సంబంధించి ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు శనివారం పోలీసులు చెప్పినట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ఎవరిని అరెస్టు చేశామనేది మాత్రం పోలీసులు చెప్పడం లేదు.
ట్విట్టర్ వెనక తాను లేనని బెంగళూరుకు చెందిన ఎగ్జిక్యూటివ్ మెహిదీ మస్రూర్ బిశ్వాస్ చెప్పినట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు అతను ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రచురితమైంది. యుకెకు చెందిన చానెల్ 4 తనను సంప్రదించిందని ఆయన అన్నారు. @ShamiWitnessను మీరు హ్యాండిల్ చేస్తున్నారా అని చానెల్ 4వారు తనను అడిగారని, అయితే తాను వ్యతిరేకించలేదని, తాను గట్టిగా వ్యతిరేకించకపోవడంతో తానే అని వారు పొరపాటు పడ్డారని ఆయన ఆ ఇంటర్వ్యూలో చెప్పారు.
తాను @ShamiWitnessను కాదని కచ్చితంగా చెప్పగలనని అన్నారు. ElSaltador@gmailగా వాడే తన ఈ మెయిల్ ఖాతాను ఎవరైనా హ్యాక్ చేసి ఉంటారని, తద్వారా స్టఫ్ అంతా అప్‌లోడ్ చేసి ఉంటారని అన్నారు.

చానెల్ 4 న్యూస్ వార్తాకథనం సారాంశం ఇదే..
సిరియా ఉగ్రవాద సంస్ధ ఇస్లామిక్ స్టేట్‌కు ట్విట్టర్ ద్వారా ఆన్‌లైన్ నియామకాలకు సహకరిస్తున్న వ్యక్తి జాడను కనుగొన్నారు. దానికి సంబంధించిన వివరాలను ఛానల్ 4 తన నివేదికలో పేర్కొంది. బ్రిటన్‌కు చెందిన ఛానల్ 4 వెల్లడించిన నివేదిక ప్రకారం బెంగళూరు కేంద్రంగా ఓ ఇండియన్ కంపనీలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్న ఉద్యోగి ఒకరు ఇస్లామిక్ స్టేట్ ఆన్ లైన్ నియామకాలకు సహకరిస్తున్నాడని, లక్షల మంది చూస్తున్న ఐఎస్ ట్విట్టర్ ఖాతాను నిర్వహిస్తోంది అతనేనని పేర్కొంది.
'షమీ విట్నెస్' పేరిట ఆతను నిర్వహిస్తున్న ట్విట్టర్ ఖాతాను 17,700 మంది ఫాలో అవుతున్నారని, నెలలో 20 లక్షల మంది అతని పోస్ట్ లను చూశారని తెలిపింది. ఆ వ్యక్తి పేరు 'మెహ్ది'తో మొదలవుతుందని, అతనితో తాము మాట్లాడామని వెల్లడించింది. అయితే, ఆ ట్విట్టర్ ఖాతా వెనక ఉన్న వ్యక్తి ఆచూకీ బట్టబయలు కావడంతో షమీ విట్నెస్ ఇస్లామిక్ ట్విట్టర్ ఖాతా మూతపడింది.
జిహాదీలు, ఉగ్రవాద మద్దతుదారులు, నియామకాలు జరిపే వారికి ఈ ఖాతా ఒక వారధిగా నిలిచిందని ఛానల్ 4 పేర్కొంది. బ్రిటిష్ జీహాదీలతో తానూ ఎప్పటికప్పుడు మాట్లాడుతుంటానని ఆ వ్యక్తి తెలిపినట్టు వెల్లడించింది. ఇస్లామిక్ స్టేట్ సంస్ధలో తాను కూడా చేరాలని అనుకున్నా... తన కుటుంబ ఆర్ధిక పరిస్ధితులను బట్టి తాను ఇక్కడే ఉండాల్సి వచ్చిందని తాను పేర్కొన్నట్లు వెల్లడించింది. 'షమీ విట్నెస్' ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా అమెరికాకు చెందిన పీటర్ కస్సాంగ్‌ను ఉగ్రవాదులు చంపిన వీడియోని ట్వీట్ చేశాడని పేర్కొంది.
ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్ గ్రూప్ గురించి ప్రచారం చేస్తూ వేలాది ట్వీట్లు చేస్తూ రోజంతా మెహ్ది గడిపేవాడని చానెల్ తెలిపింది. జిహాదీలకు, మద్దతుదారులకు, రిక్రూట్స్‌కు మధ్య ప్రధాన అనుసంధానకర్తగా వ్యవహరిస్తూ వచ్చాడని చానెల్ తెలిపింది. మూడింట రెండు వంతుల విదేశీ ఫైటర్లు ట్విట్టర్‌లో షమీ విట్నెస్‌ను ఫాలో అయ్యారుని, ఫైటర్స్ ట్విట్టర్ ఖాతా మూత వేసిన తర్వాత తనను ఫాలో కావాలని తురుచుగా కొత్త ఖాతాలు ఓపెన్ చేస్తాడని చానెల్ తలిపింది. బ్రిటిష్ జిహాదీలతో మెహెదీ నిత్య సంబంధాల్లో ఉన్నాడని, వారు మరణించినప్పుడు అమరవీరులంటూ కీర్తిస్తాడని జాతీయ మీడియా తెలిపింది. ఇస్లామిక్ స్టేట్‌లో మెహిదీ చేరకపోవడానికి కుటుంబమే కారణం.
తన కుటుంబానికి తన అవసరం చాలా ఉందని, అవసరం లేకుంటే అన్నీ వదిలేసి చేరేవాడినని అన్నాడు. @ShamiWitness ట్విట్టర్ ఖాతాలో మెహిదీ ప్రతి నెలా వేలాది తన సెల్‌ఫోన్ ద్వారా వేలాది అప్‌డేట్స్‌ను పోస్టు చేసినట్లు చెబుతున్నారు. అమెరికా ఎయిడ్ వర్కర్ పీటర్ కస్సింగ్ హత్యకు సంబంధించిన వీడియోను అనతు ఐదు సార్లు ట్వీట్ చేసినట్లు మీడియా కథనాలు వచ్చాయి. ఫేస్‌బుక్ పేజీలకు వస్తే అతను క్రమం తప్పకుండా జోక్స్, హాస్యస్పోరకమైన చిత్రాలను పోస్టు చేస్తాడు. సూపర్ హీరో చిత్రాల గురించి మాట్లాడుతాడు. మిత్రులతో పిజ్జా డిన్నర్స్ చిత్రాలను పోస్టు చేశాడు. లిబియా, ఈజిప్టులకు సంబంధిచిన సంభాషణలు అతని ఇస్లామిక్ సిద్ధాంతాన్ని పట్టిస్తాయి.












Click it and Unblock the Notifications