విభజన: చిరంజీవి, కావూరి డబుల్ గేమ్?

తన రాజీనామా వల్ల రాష్ట్ర విభజన ఆగిపోతుందంటే తాను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని చిరంజీవి చెబుతుండగా, తాను ఎంత దూరమైనా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని కావూరి సాంబశివ రావు చెబుతున్నారు. ఆంటోనీ కమిటీ ముందు తాము వినిపించిన వాదనల వల్ల విభజనపై కేంద్రం వెనక్కి తగ్గిందని అంటున్నారు. అయితే, పార్టీ అధిష్టానం విభజనపై వెనక్కి తగ్దబోదని అంతర్గత సమావేశాల్లో చెబుతున్నారు.
రాజీనామాలు చేయాలా, వద్దా అనే విషయంపై కేంద్ర మంత్రులకు, పార్లమెంటు సభ్యులకు మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నట్లు చెబుతున్నారు. పార్లమెంటు సభ్యులు రాజీనామాలకు సిద్ధపడుతుండగా, కేందర్ మంత్రులు వెనక్కి తగ్గుతున్నట్లు చెబుతున్నారు. పార్లమెంటు సభ్యుల ఒత్తిడికి కేంద్ర మంత్రులు ఏదో మేరకు తలొగ్గుతున్నట్లు మాత్రం కనిపిస్తోంది. విభజనపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే రాజీనామాలు చేస్తామని కేంద్ర మంత్రులు అంటున్నట్లు చెబుతున్నారు.
ఆంటోనీ కమిటీ కేవలం విభజన వల్ల తలెత్తే సమస్యలను వినడానికి మాత్రమే ఏర్పాటైందని, విభజనపై పునరాలోచన చేయడానికి కాదని స్పష్టంగానే చెబుతున్నారు. కాగా, సీమాంధ్ర మంత్రులు రాహుల్ గాంధీని కలిసి తమ వాదనను వినిపించేందుకు సిద్ధపడుతున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications