రిపబ్లిక్ డే రోజున చంద్రుడిపై ఎగరనున్న జాతీయ జెండా!

రిపబ్లిక్ డేను పురస్కరించుకొని 2018 జనవరి 26న చంద్రుడిపై జాతీయ జెండా ను ఎగురవేసేందుకు ప్రత్యేకంగా అంతరిక్ష నౌకను పంపేందుకు అహర్నిశలు పని చేస్తోంది.

బెంగళూరు: భారత అంతరిక్ష ప్రయోగాల్లో ఓ అరుదైన ఘనతను సాధించడానికి టీమ్ ఇండస్ అనే ఓ స్టార్టప్ కంపెనీ భారీ కార్యాచరణను సిద్ధం చేసింది. రిపబ్లిక్ డేను పురస్కరించుకొని 2018 జనవరి 26న చంద్రుడిపై జాతీయ జెండా ను ఎగురవేసేందుకు ప్రత్యేకంగా అంతరిక్ష నౌకను పంపేందుకు అహర్నిశలు పని చేస్తోంది.

moon-flag

ఈ మేరకు దాదాపు 320 టన్నుల భారీ రాకెట్‌ను నింగిలోకి పంపేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు చెందిన యాంత్రిక్స్‌తో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. చంద్రుడిపైకి విజయవంతంగా అంతరిక్షనౌకను ప్రయోగించే ప్రైవేట్ సంస్థలకు 20 మిలియన్ డాలర్ల విలువైన నగదు పురస్కారాన్ని అందజేస్తామంటూ 2007లో గూగుల్ ప్రకటన చేసింది.

ఈ క్రమంలో 2010లో వందమంది సభ్యులతో బెంగళూరు చెందిన టీమ్ ఇండస్ కంపెనీ ఏర్పడింది. 2017 డిసెంబర్‌లో ఈ ప్రయోగాన్ని చేపట్టనున్నట్టు టీమ్ ఇండియా ప్రతినిధి రాహుల్ నారాయణ్ తెలిపారు. పీఎస్‌ఎల్వీ ద్వారా లూనార్ ఆర్బిటర్‌ను ప్రయోగించడానికి ఒప్పందం చేసుకొన్నట్టు యాంత్రిక్స్ చైర్మన్, ఎండీ రాకేశ్ శశిభూషణ్ ధ్రువీకరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+