బిజెపి క్లియర్: జగన్‌ది మధ్యలో ప్రేమపాటనే, మరి చంద్రబాబుతో...
చంద్రబాబుతో తమ సంబంధాన్ని గురించి బిజెపి నేత మురళీధర్ రావు చేసిన వ్యాఖ్య ఓ స్పష్టత ఇస్తోంది.చంద్రబాబుతో బిజెపి అనుబంధం ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగే అవకాశమే ఉంది.
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో తమ సంబంధాన్ని గురించి బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు చేసిన వ్యాఖ్య ఓ స్పష్టతను ఇస్తున్నట్లే కనిపిస్తోంది.
అదే విధంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌తో తమ పార్టీ పెట్టుకోబోయే సంబంధం గురించి కూడా ఆయన స్పష్టత ఇచ్చారు. ఎబిఎన్ ఆంధ్రజ్యోతి మేనేజింగ్ ఎడిటర్ వేమూరి రాధాకృష్ణ నిర్వహిస్తున్న ఓపెన్ హా్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో ఆయన ఆ విషయాల గురించి మాట్లాడారు.

ఏడేడు జన్మల బంధమేమీ కాదు...
తెలుగుదేశం పార్టీతో తమది ఏడేడు జన్మల అనుబంధం ఏమీ కాదంటూనే మురళీధర్ రావు అసలు విషయం చెప్పారు తెలుగుదేశం బిజెపి భవిష్యత్తుకు ఇబ్బంది, తమ ఎదుగుదలకు ఇబ్బంది, తెలుగుదేశం పార్టీతో తెగదెంపులు చేసుకుంటేనే తమ పార్టీ పుంజుకుంటుందనే మాటల్లో నిజం లేదని ఆయన కుండ బద్దలు కొట్టి చెప్పారు. తద్వారా ఆయన టిడిపితో తమ అనుబంధం కొనసాగుతుందని చెబుతూనే తమ పార్టీలోని చంద్రబాబు వ్యతిరేకులకు ఝలక్ ఇచ్చారు.

జగన్‌ది మధ్యలో ప్రేమ పాటనే...
ఎవరో మధ్యలో వచ్చి ఓ ప్రేమ పాట ాడితే దాని అర్థం టిడిపి, బిజెపి మధ్య స్నేహం చెడిపోయినట్లు కాదని మురళీధర్ రావు స్పష్టంగానే చెప్పారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో జన్ మద్దతు తమతో ప్రేమ పాట పాడడం వంటిదని, దాన్ని సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. దీన్నిబట్టి జగన్‌తో బిజెపి పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదని స్పష్టమవుతోంది.

రజనీకాంత్‌పై స్పష్టత లేదు....
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారా, రారా అనే విషయంపైనా, ఆయన ఏం చేయబోతున్నారనే విషయంపైనా ప్రజలకు స్పష్టత లేదని, అలాగే తమ పార్టీకి కూడా స్పష్టత లేదని మురళీధర్ రావు అన్నారు. తమ పార్టీ లైన్‌లోకి రజనీకాంత్ రాలేదని చెప్పారు. తమిళ రాజకీయాల్లో తమ పార్టీ ఇప్పటి వరకు జోక్యం చేసుకోలేదని అన్నారు.

కెసిఆర్‌కు మేమే ప్రత్యామ్నాయం....
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కి ధీటుగా నిలబడగలిగే ఏకైక పార్టీ తమదేనని మురళీధర్ రావు చెప్పారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పకపోవడం వ్యూహంలో భాగమేనని అన్నారు. తమతో చాలా మంది నాయకులు టచ్‌లో ఉన్నారని చెప్పారు. సరైన సమయంలో వారు బయటకు వచ్చి తమ పార్టీలో చేరుతారని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications