'ముగిసిన అధ్యాయం' మళ్లీ తెరుస్తున్నారు: బాబులో అలజడి, అందుకే ఉన్నపళంగా..

అమరావతి: 'హోదా ఏమైనా సంజీవనా?.. హోదాతోనే సర్వం పరిష్కారమవుతాయని ఇంకా ప్రజలను మభ్య పెట్టడం తగదు..' సాక్షాత్తు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పలు వేదికల మీద చేసిన వ్యాఖ్యలివి. హోదా ముగిసిపోయిన అధ్యయనం అని బీజేపీ తేల్చేశాక.. దానికే కట్టుబడి ప్యాకేజీకే పరిమితమైపోయారు చంద్రబాబు.

అప్పటినుంచి 'హోదా'పై ఆయన ప్రతికూలంగానే స్పందిస్తున్నారు. దానిపై పోరాడుతున్న వైసీపీని కూడా ఇదంతా రాజకీయాల కోసమేనని దుమ్మెత్తి పోశారు. కానీ ఇంతలోనే సీన్ మారిపోయింది..

బాబులో అలజడి..:

బాబులో అలజడి..:

అధికారికంగా ప్రకటించలేదు.. కానీ ఓ చిన్న లీకు మాత్రం వదిలారు. ఏంటది?.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హోదాపై మళ్లీ గళమెత్తబోతున్నారని తెలిజేయడమే ఆ లీకు సారాంశం. హోదాపై వైసీపీ గట్టిగా నినదిస్తున్నవేళ.. చంద్రబాబులో ఎక్కడో అలజడి మొదలైనట్టే కనిపిస్తోందని అంటున్నారు.

పైగా కేంద్రాన్ని మరింత ఇరుకునపెట్టాలంటే హోదాను మించిన అస్త్రం లేదని ఆయన భావిస్తున్నట్టే తెలుస్తోంది. కాబట్టే.. ఇన్నాళ్ల తర్వాత మళ్లీ ఆయన నోట హోదా మాట వినిపిస్తోంది అంటున్నారు.

ఆ విషయం ఇంత ఆలస్యంగా తెలిసిందా..:

ఆ విషయం ఇంత ఆలస్యంగా తెలిసిందా..:

నిజానికి హోదా ముగిసిన అధ్యాయం కాదని, 14వ ఆర్థిక సంఘం సిఫారసుల్లో ఆ మాటే ఎక్కడ లేదని ప్రొ.నాగేశ్వర్ లాంటి రాజకీయ, ఆర్థిక నిపుణులు పదేపదే చెబుతూనే ఉన్నారు.

కానీ చంద్రబాబు మాత్రం హోదా అనే మాటనే పూర్తిగా తెరమరుగు చేసేశారు. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత కానీ 14వ ఆర్థిక సంఘం నిబంధనలు హోదాకు వ్యతిరేకంగా ఏమి లేవని చంద్రబాబు చాలా ఆలస్యంగా గ్రహించడం విడ్డూరం అంటున్నారు.

అధికారికంగా ప్రకటనేది?:

అధికారికంగా ప్రకటనేది?:

'హోదా'పై కూడా కేవలం లీకును మాత్రమే వదిలిన చంద్రబాబు.. ప్రజల్లో వచ్చే స్పందనను చూశాకే అధికారికంగా దానిపై మాట్లాడాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. అందుకే ముందుగా మీడియాకు లీకులిచ్చి.. దానిపై కాస్త చర్చ జరిగాక.. అప్పుడు హోదాపై స్పష్టమైన ప్రకటన చేయాలనుకుంటున్నారని సమాచారం.

అందుకే యూటర్న్..:

అందుకే యూటర్న్..:

హోదాపై జగన్ దూకుడుగా అడుగులేస్తున్న వేళ.. ప్రత్యేక హోదా సాధన సమితి లాంటి సంఘాలు ఇతర రాష్ట్రాల్లోనూ కార్యాచరణకు సిద్దమవుతున్నవేళ.. ఇంకా దానిపై మౌనం వహించడం టీడీపీకి చేటు చేస్తుందని చంద్రబాబు భావిస్తున్నట్టు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే హోదాపై ఆయన యూటర్న్ తీసుకున్నారని అంటున్నారు. అయితే హోదాపై పోరాటానికి సంబంధించి టీడీపీ వద్ద ప్రణాళిక ఉందా? అంటే చెప్పలేని పరిస్థితి. మరి దీనిపై చంద్రబాబు ఎలా ముందుకెళ్తారో వేచి చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+