కునుకు లేదు: బాబు చేతులేసి భరోసా (పిక్చర్స్)
విశాఖపట్నం: హుధుద్ తుఫాను నష్టాన్ని నివారించడంలో ముందు జాగ్రత్తలు తీసుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తుఫాను తాకిడితో తల్లడిల్లిన ప్రజలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడడమే కాకుండా వారికి భరోసా ఇచ్చేందుకు అవిశ్రాంతంగా పనిచేశారు.
కంటి నిండా కునుకు తీయకుండా, అలసట ప్రదర్శించకుండా ఆదివారం తెల్లవారు జాము మొదలు సోమవారం తెల్లవారు జాము ఒంటి గంట వరకు హుద్‌హుద్ విలయంపై అటు అధికారులతోనూ ఇటు మంత్రులతోనూ ఎడతెగని సమీక్షలు చేశారు. విశాఖను వణికించిన హుధుద్ తుఫాను బీభత్సం తర్వాతి చర్యలపై ఆయన అలుపెరగక శ్రమించారు.
ఆదివారం రాత్రి 9.45 నిమిషాలకు రాజమండ్రి చేరుకున్న సీఎం చంద్రబాబు వెనువెంటనే మీడియాతో మట్లాడారు. అనంతరం భోజనం చేశారు. ఆ తర్వాత మంత్రులతో తుఫాను పరిస్థితిపై చర్చించారు. మరోవైపు తుఫాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆదివారం రాత్రికి తుఫాను ఉద్ధృతి కాస్త తగ్గుముఖం పట్టడంతో.. రాత్రి వేళ అధికారులు ఎక్కడెక్కడ సహాయ చర్యలకు ఉపక్రమించారనే విషయాన్ని ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు.

రోడ్లు ఇలా..
తుఫాను బీభత్సానికి ఉత్తరాంధ్ర రోడ్లు సర్వనాశనం అయ్యాయి. గండ్లు పడ్డాయి. కొట్టుకుపోయాయి.

విద్యుత్తు స్తంభాలు కూలాయి...
హుధుద్ తుఫాను తాకిడికి విద్యుత్తు స్తంభాలు కూలిపోయాయి. గాఢాంధకారం అలుముకుంది. చెట్లు విరిగి రోడ్లపై పడ్డాయి.

రోడ్ల పునరుద్ధరణ
సోమవారం సాయంత్రానికి చాలా వరకు రోడ్లను పునరుద్ధరించారు. ట్రాఫిక్ కదలడానికి వీలుగా రోడ్లను తయారు చేశారు.

అలుపెరగక చంద్రబాబు..
సోమవారం తెల్లవారుజామున ఒంటిగంట తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకున్న చంద్రబాబు కొద్దిసేపటికే కాలకృత్యాలు ముగించుకుని తిరిగి తెల్లవారుజాము 4 గంటల నుంచే జిల్లా కలెక్టర్లతో టెలీ కాన్ఫ్‌రెన్స్‌లకు ఉపక్రమించారు.

అలుపెరుగక చంద్రబాబు
చంద్రబాబు రాజమండ్రి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి విశాఖపట్నంలో ఏరియల్ సర్వే నిర్వహించారు. కలెక్టరేట్‌లో అధికారులతో పరిస్థితి సమీక్షించారు. అనంతరం విశాఖలో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు.

వాహనాలు ధ్వంసం..
హుధుద్ తుఫాను తాకిడికి రోడ్లపై నిలిచి ఉన్న వాహనాలపై చెట్లు విరిగి పడ్డాయి. షోరూముల్లోని వాహనాలు కూడా రోడ్డుపై పడ్డాయి.

చెట్లు తొలగించారు..
చంద్రబాబు నిరంతర సమీక్ష, చర్చలు ఫలితాలు ఇచ్చాయి. రోడ్లపై విరిగి పడిన చెట్లను తొలగించడంలో అధికారులు, సిబ్బంది అత్యంత వేగంగా కదిలారు.

ఇలా తొలగించారు..
రోడ్లకు అడ్డంగా ఉన్న చెట్లను పోలీసులు, ఇతర సిబ్బంది తొలగించే పనిలో విజయం సాధించారు. వాహనాలకు ఇబ్బంది లేకుండా చూశారు.












Click it and Unblock the Notifications