వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫ్యాన్స్ వెనక బాలయ్య: బాబుకు మరో తలనొప్పి?

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu in trouble with Balaiah fans
హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ తలనొప్పి వదిలిందని భావిస్తున్న తరుణంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు మరో తలనొప్పి నందమూరి కుటుంబ సభ్యుల నుంచి ప్రారంభమైంది. హరికృష్ణను దూరం పెట్టి, బాలకృష్ణను దగ్గర తీసినప్పటికీ చంద్రబాబుకు ఆ సమస్య తీరినట్లు లేదు. తాజాగా, బాలకృష్ణ ఫ్యాన్స్ రాష్ట్ర సలహాదారు చల్లకొండ రమేష్ చేసిన వ్యాఖ్యలు, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో బాలకృష్ణ అభిమానుల ఆందోళన ఆషామాషీ వ్యవహారం కాదని భావిస్తున్నారు.

బాలకృష్ణ పార్టీలో ప్రధానమైన పాత్ర ఆశిస్తున్న క్రమంలో భాగంగానే ఆ పరిణామాలు చోటు చేసుకున్నట్లు భావిస్తున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా తనకు అవకాశం కల్పిస్తే చంద్రబాబు ఏకపక్షంగా వ్యవహరించడానికి వీలు కాదని బాలకృష్ణ భావిస్తున్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణను కూడా హరికృష్ణను పంపినట్లు పార్లమెంటుకు పంపి పార్టీ పగ్గాలను తన కుమారుడు నారా లోకేష్‌కు అప్పగించాలనే చంద్రబాబు ప్రయత్నాలు గమనించిన తర్వాతనే బాలకృష్ణ అభిమానులు తెర మీదికి వచ్చినట్లు చెబుతున్నారు.

రాష్ట్ర విభజన జరిగిన, ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో పార్టీలో తన స్థానమేమిటో తేల్చుకుంటే తప్ప తదుపరి రాజకీయ భవిష్యత్తు నిర్ణయం కాదనే ఉద్దేశంతో బాలకృష్ణ ఉన్నట్లు చెబుతున్నారు. అందుకే, చంద్రబాబు తర్వాతి స్థానాన్ని తాను దక్కించుకుని, పార్టీ వ్యవహారాలపై పట్టు సాధించాలనే ఉద్దేశంతో బాలకృష్ణ వ్యవహరిస్తున్నట్లు చెబుతున్నారు.

తాజా పరిణామాలు తెలుగుదేశం పార్టీని కలవరపెడుతున్నట్లే ఉంది. బాలకృష్ణ ఎక్కడ కావాలంటే అక్కడ పోటీ చేయవచ్చనని, ఏ సీటు కావాలంటే ఆ సీటు ఇవ్వడానికి పార్టీ సిద్ధంగా ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, బాలకృష్ణ ఆశిస్తున్నది కేవలం తాను పార్లమెంటుకో, శాసనసభకు మాత్రమో వెళ్లడం కాదని, అంతకన్నా పార్టీపై ఏదో మేరకు తనకు పట్టు కావాలని బాలకృష్ణ ఆశిస్తున్నట్లు చెబుతున్నారు.

English summary
Telugudesam party president Nara Chandrababu is facing another trouble from Balakrishna fans.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X