బతుకమ్మ ఆడారు.. జెపి కాలర్ పట్టారు (పిక్చర్స్)
న్యూఢిల్లీ: తెలంగాణ ముసాయిదా బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధపడిన నేపథ్యంలో మంగళవారం ఢిల్లీలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన వేడి కనిపించింది.
కేంద్రం పైన అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టినందుకు కాంగ్రెసు పార్టీ అధిష్టానం ఆరుగురు ఎంపీల పైన వేటు వేసింది. మరోవైపు పలువురు తెలంగాణవాదులు లోక్‌సత్తా పార్టీ అధ్యక్షులు జయప్రకాశ్ నారాయణ గల్లా పట్టుకొని దాడికి యత్నించారు.
తెలంగాణ, సీమాంధ్ర ప్రాంత నేతలు, మద్దతుదారులు ఢిల్లీ వీధుల్లో సమైక్య, తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. ఢిల్లీలో మంగళవారం తెలంగాణ వేడి కనిపించింది. ఇంకోవైపు బిజెపి సీనియర్ నేత అద్వానీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఢిల్లీ 1
తెలంగాణ ముసాయిదా బిల్లును పార్లమెంటులో వెంటనే ప్రవేశ పెట్టి ఆమోదం తెలిపేలా చూడాలని కోరుతూ ఢిల్లీలో బతుకమ్మ ఆడుతున్న తెలంగాణ న్యాయవాదులు.

ఢిల్లీ 2
ఆర్టికల్ 3 ప్రకారం పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టాలని, తక్షణం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ తెలంగాణ న్యాయవాదుల ఐక్యకార్యాచరణ సంఘం ధర్నా.

ఢిల్లీ 3
పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టాలని, తక్షణం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ హిందీలో రాసి తెలంగాణ ఆకాంక్షను తెలియజేస్తూ... మేరా భారత్ మహాన్ - మేరా తెలంగాణ మహాన్ అంటూ రాసిన దృశ్యం.

ఢిల్లీ 4
లోక్‌సత్తా పార్టీ అధ్యక్షులు, కూకట్ పల్లి శాసన సభ్యులు జయప్రకాశ్ నారాయణ మంగళవారం న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతున్న దృశ్యం.

ఢిల్లీ 5
లోక్‌సత్తా పార్టీ అధ్యక్షులు, కూకట్ పల్లి శాసన సభ్యులు జయప్రకాశ్ నారాయణ మంగళవారం న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతుండగా వాగ్వాదం.

ఢిల్లీ 6
పలువురు తెలంగాణవాదులు ఢిల్లీలో మంగళవారం లోక్‌సత్తా పార్టీ అధ్యక్షులు, కూకట్ పల్లి శాసన సభ్యులు జయప్రకాశ్ నారాయణ కాలర్ పట్టుకున్నారు.

ఢిల్లీ 7
పలువురు తెలంగాణవాదులు ఢిల్లీలో మంగళవారం లోక్‌సత్తా పార్టీ అధ్యక్షులు, కూకట్ పల్లి శాసన సభ్యులు జయప్రకాశ్ నారాయణ కాలర్ పట్టుకున్నారు. పోలీసులు ఆయనను భద్రత మధ్య తీసుకెళ్లారు.

ఢిల్లీ 8
పలువురు తెలంగాణవాదులు ఢిల్లీలో మంగళవారం లోక్‌సత్తా పార్టీ అధ్యక్షులు, కూకట్ పల్లి శాసన సభ్యులు జయప్రకాశ్ నారాయణ కాలర్ పట్టుకున్నారు. పోలీసులు ఆయనను భద్రత వలయం మధ్య తీసుకెళ్లారు.

ఢిల్లీ 9
తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో మంగళవారం ఢిల్లీలో జరిగిన ఆందోళనలో పాల్గొని మాట్లాడుతున్న విద్యాసాగర రావు. పక్కన బండారు దత్తాత్రేయ, నాగం జనార్ధన్ రెడ్డి, యెండల లక్ష్మీ నారాయణ.

ఢిల్లీ 10
తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో మంగళవారం ఢిల్లీలో జరిగిన ఆందోళనలో పాల్గొని మాట్లాడుతున్న తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్.

ఢిల్లీ 11
తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో మంగళవారం ఢిల్లీలో జరిగిన ఆందోళనలో పాల్గొని మాట్లాడుతున్న తెలంగాణ రాష్ట్ర సమితి నేత వినోద్ కుమార్.

ఢిల్లీ 12
ఖమ్మం జిల్లా తెలంగాణ ప్రాంత నాయకులు మంగళవారం ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసి భద్రాచలం డివిజన్‌ను తెలంగాణ ప్రాంతంలోనే ఉంచాలని కోరారు.

ఢిల్లీ 13
విజయవాడ పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్, ఎపిఎన్జీవో అధ్యక్షులు అశోక్ బాబు మంగళవారం ఢిల్లీలో ఎపి భవన్లో విలేకరులతో మాట్లాడుతూ...

ఢిల్లీ 14
భారతీయ జనతా పార్టీ అగ్రనేత, కేంద్ర మాజీ మంత్రి వెంకయ్య నాయుడు నివాసం వద్ద మంగళవారం తెలంగాణవాదులు ఆందోళనకు దిగారు.

ఢిల్లీ 15
భారతీయ జనతా పార్టీ అగ్రనేత, కేంద్ర మాజీ మంత్రి వెంకయ్య నాయుడు నివాసం వద్ద మంగళవారం తెలంగాణవాదులు, ఓయు జెఏసి నాయకులు ఆందోళనకు దిగారు.

ఢిల్లీ 16
తెలంగాణ ఐక్యకార్యాచరణ సమితి నాయకులు కోదండరామ్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు మంగళవారం ఢిల్లీలో స్వామి అగ్నివేష్‌ను కలుసుకున్నారు.












Click it and Unblock the Notifications