క్లీన్ సెలిబ్రిటీస్‌తోనే పోలీసులు: జూ.ఎన్టీఆర్, రాజమౌళి...
Recommended Video

హైదరాబాద్: సినీ ప్రముఖులతో హైదరాబాద్ పోలీసులు ప్రయోగం చేస్తున్నారు. నేరాలకు వ్యతిరేకంగా ప్రచారం చేసే ప్రణాళికలో భాగంగా వారు క్లీన్ ఇమేజ్ ఉన్న సినీ ప్రముఖులను ఎంపిక చేసుకుని ఆ ప్రయోగం చేస్తున్నారు.
నేరాలకు వ్యతిరేకంగా ప్రచారం చేసే ప్రణాళికలో భాగంగా హైదరాబాదులో పోలీసులు లఘు చిత్రాలను నిర్మిస్తున్నారు. ఈ లఘు చిత్రాలను థియేటర్లలో ప్రదర్శించడానికి కేంద్ర ఫిల్మ్ సర్టిపికేషన్ బోర్డు (సిబిఎఫ్‌సి) అనుమతి ఇచ్చింది.

ఇప్పటి వరకు ఐదు చిత్రాలను...
క్లీన్ ఇమేజ్ ఉన్న సినీ ప్రముఖులతో ఇప్పటి వరకు హైదరాబాదు పోలీసులు ఐదు లఘు చిత్రాలను నిర్మించినట్లు తెలుస్తోంది.ఈ మేరకు ఓ అంగ్ల మీడియా వార్తాకథనాన్ని ప్రచురించింది. ఈ ఐదు చిత్రాలను కూడా సిబిఎఫ్‌సి క్లియర్ చేసింది.

జూ. ఎన్టీఆర్‌తో...
నేరాలకు వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి నిర్మించిన లఘు చిత్రంలో హైదరాబాద్ పోలీసులు ఎన్టీఆర్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఫ్రాడ్, సోషల్ మీడియా క్రైమ్, జాబ్ ఫ్రాడ్స్ తదితర నేరాలకు వ్యతిరేకంగా లఘు చిత్రాల ద్వారా ప్రచారం చేస్తారు.

దర్శకుడు రాజమౌళితో కూడా...
బహుబలి దర్శకుడు రాజమౌళితో కూడా హైదరాబాదు పోలీసులు ఓ లఘు చిత్రం నిర్మించినట్లు చెబుతున్నారు. బాహుబలి చిత్రం ద్వారా రాజమౌళి దేశవ్యాప్తంగా ప్రఖ్యాతి సాధించిన విషయం తెలిసిందే.

అర్జున్ రెడ్డి హీరో విజయ్ దేవరకొండతో...
యువ హీరో విజయ్ దేవరకొండతో కూడా హైదరాబాదు ఓ లఘు చిత్రాన్ని నిర్మంచినట్లు సమాచారం. అర్జున్ రెడ్డి సినిమా ద్వారా విజయ్ దేవరకొండ విశేషమైన ఆదరణ పొందారు. యువతలో ఆయన పట్ల ఓ క్రేజ్ ఏర్పడింది.












Click it and Unblock the Notifications