అడ్డంగా బుక్కయాడు.. అమ్మాయిలను'కిస్' చేసి ఇంటర్నెట్‌లో..

రోడ్డున పోయే కొంతమంది ఆడపిల్లలను క్షణాల్లో ముద్దుపెట్టుకుని తుర్రమనడం.. ఆ తతంగమంతా ప్రాంక్ పేరిట ఇంటర్నెట్ లోకి ఎక్కించడం చేశాడు.

న్యూఢిల్లీ: అకడమిక్ చదువులతో కుస్తీ పడుతూ కెరీర్ వెతుక్కునేవాళ్ల కన్నా.. ఇంటర్నెట్ సహాయంతో ఇంటినుంచే డబ్బులు ఎలా సంపాదించాలన్న ఆలోచనలో ఇప్పటి యువతరం చాలామంది ఉన్నారు.

అయితే.. నలుగురు మెచ్చే పనో.. లేక ఎవరిని నొప్పించని పనో చేసుకుని సంపాదించుకుంటే ఎవరికీ ఎలాంటి బాధ ఉండదు గానీ.. కేవలం సెన్సేషన్ కోసమో, పాపులారిటీ కోసమో తింగరి వేషాలు వేస్తే మాత్రం సీన్ రివర్స్ అయిపోవడం ఖాయం.

సెక్షన్ల దాకా వెళ్లింది..

సెక్షన్ల దాకా వెళ్లింది..

అచ్చు ఇదే తిరహాలో తన యూట్యూబ్ చానెల్ కోసం తింగరి వేషాలు వేసి సుమిత్ అనే ఢిల్లీ యువకుడు అడ్డంగా బుక్కైపోయాడు. సరదాకి చేశాను అని ఇప్పడు అతను బుకాయించినా.. విషయం సెక్సువల్ వేధింపులు.. సెక్షన్ల దాకా వెళ్లింది.

యూట్యూబ్ చానెల్.. ప్రాంక్ వీడియో..

యూట్యూబ్ చానెల్.. ప్రాంక్ వీడియో..

ఇంతకీ అతను చేసిందేంటంటే!.. యూట్యూబ్ లో 'ది క్రేజీ సుమిత్' పేరిట అతనికో చానెల్ ఉంది. అయితే ఎక్కువమంది నెటిజెన్స్ ను ఆకర్షించడం కోసం సంచలనాత్మక వీడియోలు చేయాలనుకున్నాడు. ఇందుకోసం ప్రాంక్ (సరదాగా ఆటపట్టించడం) కాన్సెప్టును ఎంచుకున్నాడు.

ఆడపిల్లలను బలవంతంగా ముద్దుపెట్టుకుని...

ఆడపిల్లలను బలవంతంగా ముద్దుపెట్టుకుని...

ఐడియా బాగుందని వెంటనే రంగంలోకి దిగిపోయాడు. రోడ్డున పోయే కొంతమంది ఆడపిల్లలను క్షణాల్లో ముద్దుపెట్టుకుని తుర్రమనడం చేశాడు. అలా ముగ్గురు, నలుగురు అమ్మాయిలను ముద్దుపెట్టుకుని.. ఆ వీడియోలను చిత్రీకరించాడు. ఆ తర్వాత ప్రాంక్ పేరిట ఆ తతంగాన్నంతా ఇంటర్నెట్ లో అప్ లోడ్ చేశాడు.

సీన్ రివర్స్.. మహిళా కమిషన్ సీరియస్..

సీన్ రివర్స్.. మహిళా కమిషన్ సీరియస్..

అయితే ఇక్కడే సీన్ రివర్స్ అయింది. ఢిల్లీ మహిళా కమిషన్ స్వాతి మలివాల్ దృష్టికి ఈ వీడియో వెళ్లింది. ఎవరు అన్నది ఆరా తీస్తే.. సుమిత్ అని తేలింది. ఇది గనుక లైంగిక దాడిగా భావిస్తే.. సుమిత్ పై ఐపిసి సెక్షన్-354కింద కేసు నమోదు చేసి జైలుకు పంపించే యోచనలో ఉన్నారు.

క్షమాపణతో ఆగేలా లేదు..

క్షమాపణతో ఆగేలా లేదు..

మహిళా కమిషన్ కు ఈ విషయం తెలియగానే సుమిత్ అప్రమత్తమయ్యాడు. వెంటనే తన చానెల్ నుంచి వీడియోను తొలగించాడు. అందుకు క్షమాపణలు కూడా చెప్పుకున్నాడు. సరదా కోసమే చేశానని, మహిళలు వ్యతిరేకిస్తారని అనుకోలేదని పేర్కొన్నాడు. అయితే క్షమాపణలతోనే దీనిక తెరపడేలా లేదు. మొత్తానికి ఆకతాయి పనులతో తన కెరీర్ ను సుమిత్ తనంతట తానే సంకటంలోకి నెట్టేసుకున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+