నవ్వే సమస్యనా: రిషికేశ్వరి సూసైడ్ నోట్ పూర్తి పాఠం
గుంటూరు: నాగార్జున విశ్వవిద్యాలయంలో రిషికేశ్వరి అనే విద్యార్థిని ఆత్మహత్య ర్యాగింగ్ భూతానికి పరాకాష్టగా నిలిచింది. సీనియర్ల వేధింపులతో ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆమె రాసిన సూసైడ్ నోట్ ఆమె మానసిక పరిస్థితిని, ఉద్వేగాలను తెలియజేస్తుంది.
ఎల్లవేళలా నవ్వుతూ ఉండే తాను ఎందుకు ఏడ్వాల్సి వచ్చిందో, తన తల్లిదండ్రులు తనను ప్రేమగా చూడడమే ఎందుకు తప్పయిందో ఆ లేఖను చదివితే అర్థమవుతుంది. ఆమె రాసిన సూసైడ్ నోట్‌లోని వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

నవ్వు... నవ్వు... నవ్వు... ఈ నవ్వంటే నాకు చాలా ఇష్టం. అందుకే నేనెప్పుడూ నవ్వూతూ, అందరినీ నవ్విస్తూ ఉంటాను. కానీ ఆ నవ్వే నాకు పెద్ద సమస్య అయింది. మా నాన్నంటే నాకు చాలా ఇష్టం. నిజానికి పిచ్చి. అంత ప్రేమగా పెంచారు నాన్న. నాకు చదువంటే చాలా ఇష్టం. ఈ చదువు కోసం నా ఊరు వరంగల్ నుమచి ఇక్కడికి చదువుకోవడానికి వచ్చాను. ఇలా చదువుకోవడానికి వచ్చిన నన్ను సీనియర్లలో కొంత మంది చదువులోకి కాకుండా ప్రేమలోకి లాగడానికి ప్రయత్నించారు. నేను ఆ దారిలోకి వెళ్లలేదు. దాంతో నా మీద రూమర్లు స్ప్రెడ్ చేశారు. అవి వింటే నా ముఖంలో నవ్వు మాయమై పోయేది. ఏడుపు కూడా వచ్చేది.
నేను నాన్న దగ్గర ఏమీ దాచేదాన్ని కాదు. కానీ ఇక్కడికొచ్చి దాయాల్సి వస్తోంది. చెబితే ఏమైపోతారో అని భయంతో దాయాల్సి వస్తోంది. అలా నేను దాచినప్పుడల్లా నాకు నరకయాతన కనిపిస్తోంది. సీనియర్లలో దీప, అవినాష్, లావణ్య, ప్రసాద్ .. వీళ్లు చేసిన హెల్ప్ నేనెప్పటికీ మర్చిపోలేను. నాన్నా, వీళ్లకొక్కసారి థాంక్స్ చెప్పండి. ఎప్పుడూ వీళ్లతో కాంటాక్ట్‌లో ఉండండి. నా ఆఖరి కోరిక ఒక్కటే. నా చావుకు కారణం ఎవరో నాకు తెలుసు. వాళ్లు వాళ్ల తప్పు తెలుసుకుంటే చాలు. ఇక ఎవరినీ నాలా బాధపెట్టకపోతే చాలు. ఏ అమ్మాయీ యూనివర్శిటిలో ర్యాగింగ్ ఉండదు అనుకోవద్దు. యూనివర్శిటీ అంటేనే నరకం నాన్నా. ఏ తల్లిదండ్రులూ పిల్లలను ఇంత ప్రేమగా పెంచొద్దు. మీకు చెప్పలేక, వాళ్లలో వాళ్లు దాచుకోలేక నరకం కనిపిస్తుంది.
అమ్మా, నాన్నా జాగ్రత్త. నాన్నా ప్లీజ్ ఏడవకండి. నేనెప్పుడూ మీ దగ్గర్లోనే ఉంటాను. అమ్మా నువ్వు కూడా జాగ్రత్త. ఐ లవ్యూ మామ్, ఐ లవ్యూ డాడ్. ట్రై టు డొనేట్ మై ఆర్గాన్స్ ఇఫ్ దే ఆర్ ఇన్ గుడ్ కండీషన్. డాడ్, నేను చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. అవి మీరు చేసేయ్యండి. సీనియర్ లావణ్యకి ఒక ఇంజనీరింగ్ బుక్ కొనివ్వండి. రాజుకి 350 రూపీస్ ఇవ్వండి. ప్రసాద్ సర్, ఇంకా జితేంద్రకి థాంక్స్ చెప్పండి. బై ఫరెవర్ అండ్ ఎవర్!












Click it and Unblock the Notifications