వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబుకు రాజయోగం లేదంటే ఎన్టీఆర్ నమ్మారు: కీలకాంశాలతో దాడి పుస్తకం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు దివంగత ఎన్టీఆర్, ప్రస్తుత టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై ప్రముఖ రాజకీయ నాయకుడు దాడి వీరభద్రరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతేగాక, దివంగత నేత ఎన్టీఆర్‌పై పుస్తకం రాస్తున్నానని ఆయన తెలిపారు.

ఇటీవల ఆయన ఓ టీవీ ఛానెల్ కిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఎన్టీఆర్ చరిత్రపై సరైన పుస్తకం లేదని అన్నారు. ఆయన గురించిన చాలా విషయాలు ఎవరికీ తెలియవని ఆయన పేర్కొన్నారు. ఆయన అంతరంగాన్ని ఆవిష్కరిస్తూ, తెలుగు, ఇంగ్లీషు భాషల్లో ఒక పుస్తకం రాస్తున్నానని ఆయన తెలిపారు.

దేశంలో అనేక సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికిన ఎన్టీఆర్ గురించి సవివరంగా చెప్పాలన్న ఉధ్దేశంతో ఈ పుస్తకాన్ని రాస్తున్నానని ఆయన తెలిపారు. ఎన్టీఆర్ కు సంబంధించిన అన్ని విషయాలు అందులో ప్రస్తావిస్తానని ఆయన స్పష్టం చేశారు. ఆయనకు సంబంధించిన చాలా విషయాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. తన పుస్తకం అన్ని విషయాలను వివరిస్తుందని ఆయన అన్నారు.

babu-dadi

ఎన్టీఆర్, బాబును కలిపే అవకాశం ఎవరికీ రాలేదు

చంద్రబాబునాయుడు, ఎన్టీఆర్ మధ్య సయోధ్యకు తాను ప్రయత్నించానని దాడి వీరభద్రరావు తెలిపారు. 'సర్, మీరిద్దరూ రెండు అధికార కేంద్రాలుగా ఉండటం పార్టీలో అందరికీ ఇబ్బందిగా ఉంది. మీరు కలిసిపోతే బాగుంటుంది' అని చంద్రబాబునాయుడుకు తాను సూచించానని దాడి చెప్పారు.

దీంతో ఆయన కూడా సానుకూలంగా స్పందించి, ఆయనను కలవడంలో ఇబ్బందులేమున్నాయని చెప్పి.. ఎన్టీఆర్‌ను కలిశారని గుర్తుచేసుకున్నారు.
అయితే ఆ భేటీ కూడా సానుకూలంగా సాగలేదని ఆయన అన్నారు. ఆ తర్వాత వారిద్దరినీ కలిపే ఎలాంటి అవకాశం రాలేదని ఆయన చెప్పారు.

ఎన్టీఆర్ అలాంటి వ్యక్తి కాదు

ఎన్టీఆర్ వివాహానంతరం అడ్మినిస్ట్రేషన్‌లో లక్ష్మీ పార్వతి కలుగజేసుకుంటున్నారన్నది ఆమె వ్యతిరేకవర్గం ఆరోపణ అని దాడి వీరభద్రరావు స్పష్టం చేశారు. ఆమె చెబితే తాను ఎందుకు నిర్ణయాలు తీసుకుంటానని, ఒకరు చెబితే నిర్ణయాలు తీసుకునే వ్యక్తిత్వం తనది కాదని ఎన్టీఆర్ భావనని ఆయన అన్నారు.

కొన్ని సందర్భాల్లో లక్ష్మీ పార్వతి ఏదైనా చెప్పినప్పటికీ, అందుకు భిన్నంగా తాము ఏదైనా సలహా ఇస్తే ఆయన దానినే అమలు చేసేవారని ఆయన గుర్తుచేసుకున్నారు. అసలు ఆమె చెప్పినట్టు ఎన్టీఆర్ ఏ రోజూ చేయలేదని, అలా ఒకరు చెబితే చేసే వ్యక్తిత్వం ఆయనది కాదని దాడి తెలిపారు.

'చంద్రబాబుకు రాజయోగం లేదు' అని జ్యోతిష్యుడు చెప్పడం వల్లే ఎన్టీఆర్ అప్పుడు ధైర్యంగా వున్నారు

ఎన్టీఆర్ ఆనాటి పరిస్థితులను సరిగ్గా బేరీజు వేయలేకపోయారని దాడి వీరభద్రరావు తెలిపారు. వైస్రాయి ఘటనకు ముందు జరుగుతున్న పరిస్థితులను ఆయన తెలుసుకున్నప్పటికీ ఒక మొండి ధైర్యంతో ఉన్నారని అన్నారు. 'బ్రదర్! ఓట్లేయండని ప్రజలను నేను కోరితే గెలిచిన ఎమ్మెల్యేలు... నన్ను దించేసే పరిస్థితి ఉత్పన్నమవుతుందా?' అని ఆయన ఆలోచించారని దాడి చెప్పారు.

వాళ్లు తనను ఊరికే బెదిరిస్తున్నారన్న ఆలోచనలో ఆయన ఉండేవారని ఆయన తెలిపారు. ఆయనను దింపేసే పరిస్థితి వచ్చినప్పుడు.. వ్యతిరేకవర్గాన్ని పిలవాలని తాము సూచించామని ఆయన అన్నారు. దానికి ఆయన అంగీకరించలేదని దాడి చెప్పారు.

'ఏమీ జరగదులే' అన్న ధైర్యం, వారికి తాను లొంగడమేంటనే ఆలోచన కూడా ఉండేదని, దీంతో ఆయన దానికి అంగీకరించలేదని అన్నారు. అందుకు బదులుగా ఆయన ఢిల్లీ నుంచి జాతీయ స్థాయి ఆస్ట్రాలజర్‌ను తీసుకొచ్చి, చంద్రబాబు జాతకం ఇచ్చి చూడమన్నారని ఆయన తెలిపారు.

కాగా, ఆ జ్యోతిష్యుడు 'రామారావు గారూ, మీరు ఆందోళన చెందాల్సిన పని లేదు. చంద్రబాబుకు రాజయోగం లేదు. ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు'అని చెప్పారని తెలిపారు. అంతేగాక, ఎన్టీఆర్ పట్టుదలకు జ్యోతిష్యుడు చెప్పిన మాటలు కలిసి రావడంతో ఆయనలో ధైర్యం పెరిగిందని దాడి తెలిపారు.

ఈ ఘటన జరిగిన తర్వావాత కూడా సదరు జ్యోతిష్యుడిపై ఆయనకు నమ్మకం పోలేదని...'చంద్రబాబు పుట్టినరోజు డేట్ తప్పా? లేక ఆయన అలా చెప్పాలని చెప్పారా?' అంటూ ఎన్టీఆర్ తనతో వ్యాఖ్యానించారని ఆయన తెలిపారు. ఏదేమైనా దాడి వీరభద్రరావు దివంగత నేత ఎన్టీఆర్‌పై పుస్తకం తీసుకురానున్నారు. అందులో చాలా ఆసక్తికరమైన అంశాలే ఉండనున్నట్లు తెలుస్తోంది. మరి ఆ పుస్తకం తాజా రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచిచూడాలి మరి.

English summary
Political leader Dadi Veerabhadra Rao wanted to write a book on Telugudesam Party founder NTR.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X