వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాకింగ్: గర్భిణిలు ఆ తప్పు చేస్తే.. తరాల పాటు దాని ఎఫెక్ట్..

సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) తాజాగా ఈ హెచ్చరికలు జారీ చేసింది. మద్యం సేవించే గర్భిణీ స్త్రీలు ఫేటల్ ఆల్కహాల్ స్పెక్ట్రమ్ డిసార్డర్స్ (ఎఫ్‌ఏఎస్‌డీ)కి గురవుతారని హెచ్చరించింద

|
Google Oneindia TeluguNews

కాలిఫోర్నియా: గర్భంతో ఉన్న సమయంలో మహిళలు చేసే ఒక్క తప్పు.. తరాల పాటు వెంటాడుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ప్రెగ్నెన్సీ సమయంలో ఆల్కాహాల్ తీసుకోవడం వల్ల.. పుట్టబోయే బిడ్డల శరీర బరువు, మెదడుపై అది దుష్ఫలితాలను చూపిస్తుందని అంటున్నారు.

మెదడులో అసమతౌల్యత వల్ల పిల్లల ప్రవర్తనలోను తేడా వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) తాజాగా ఈ హెచ్చరికలు జారీ చేసింది. మద్యం సేవించే గర్భిణీ స్త్రీలు ఫేటల్ ఆల్కహాల్ స్పెక్ట్రమ్ డిసార్డర్స్ (ఎఫ్‌ఏఎస్‌డీ)కి గురవుతారని హెచ్చరించింది.

Drinking Alcohol While Pregnant Could Have Transgenerational Effects

దీని ప్రభావం ఆ తర్వాతి తరాలను కూడా వెంటాడుతుందని, తర్వాతి తరంలో ఆల్కాహాల్ తీసుకోని వారిపై ఈ ప్రభావం పడుతుందని సీడీసీ పరిశోధకులు చెప్పారు. ఎలుకలపై నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం స్పష్టమైనట్లు కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన హఫ్‌మ్యాన్ అనే పరిశోధకుడు తెలిపారు.

గర్భిణీ స్త్రీలు ఆల్కహాల్ కు దూరంగా ఉంటే.. కొన్ని తరాలను వారు కాపాడినవారు అవుతారని సూచిస్తున్నారు. గర్భిణీ స్త్రీలు-ఆల్కహాల్ పై కాలిఫోర్నియా పరిశోధకులు చేసిన అధ్యయనంపై సెరెబ్రల్ కోర్టెక్స్ జర్నల్‌ తాజాగా ఒక కథనాన్ని ప్రచురించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

English summary
Soon-to-be mothers have heard the warning – don’t drink while pregnant. The Centers for Disease Control and Prevention (CDC) has issued numerous statements about the dangers of alcohol consumption during pregnancy, as it can lead to Fetal Alcohol Spectrum Disorders (FASD) in newborns.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X