అజిత్ 'పొలిటికల్ ఎంట్రీ'కి అభిమానుల డిమాండ్: పుట్టినరోజు నాడు ఏం చెప్తారో!

మే 1న హీరో అజిత్ తన 46వ పడిలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో.. పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ, రాజకీయాల్లోకి రావాలన్న తమ ఆకాంక్షను కూడా వెలిబుచ్చారు.

చెన్నై: తమిళ రాజకీయాల్లో గందరగోళం పెరుగుతూనే ఉంది. ఆర్కేనగర్ ఉపఎన్నిక నుంచి మరోసారి తమిళ రాజకీయాల్లో మొదలైన వివాదాలు.. సంచలనం రేకెత్తించే దిశగా సాగుతున్నాయి. ఏకంగా ఎన్నికల కమిషన్‌కే దినకరన్ ముడుపులు ముట్టజెప్పారని ఆరోపణలు వస్తుండటంతో దేశవ్యాప్తంగా ఇది చర్చనీయాంశమైంది.

మొత్తం మీద దివంగత సీఎం జయలలిత మృతి అనంతరం కొనసాగిన హైడ్రామా మరోసారి తమిళ రాజకీయాల్లో కనిపిస్తోంది. ఈ లెక్కన తమిళ రాజకీయాల్లో అనిశ్చితి సర్దుమణగడం అయ్యే పనేనా? అన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇంతలా అనిశ్చితి నెలకొన్న రాజకీయాల్లో మరో కొత్త నాయకుడి కోసం తమిళ ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు.

Fans demand ajith for political entry in tamilnadu

ఈ నేపథ్యంలో వారి చూపు, ఆకాంక్ష అన్ని తలైవా రజనీకాంత్ వైపే ఉన్నా.. ఆయన మాత్రం రాజకీయాలకు ససేమిరా అంటున్న సంగతి తెలిసిందే. దీంతో ఆయన తర్వాత తమిళనాట అంత స్థాయి ఫాలోయింగ్ ఉన్న అజిత్ పై ఇప్పుడు అక్కడి ప్రజల్లో ఆకాంక్ష వ్యక్తమవుతోంది. ఆయన రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటూ మదురైలోని కొంతమంది అభిమానులు రాష్ట్రంలోని పలుచోట్ల పోస్టర్లు, బ్యానర్లను అంటించారు.

మే 1న హీరో అజిత్ తన 46వ పడిలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో.. పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ, రాజకీయాల్లోకి రావాలన్న తమ ఆకాంక్షను కూడా వెలిబుచ్చారు. తన పుట్టినరోజు నాడు అజిత్ దీనిపై ప్రకటన చేస్తే బాగుంటుందని వారు అభిప్రాయపడుతున్నారు.

కాగా, జయలలిత తన చివరి రోజుల్లో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో.. తన వారసుడిగా అజిత్ ను ప్రకటిస్తారని ముమ్మరంగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అజిత్ ను జయలలిత కొడుకులా భావిస్తారని, కాబట్టి ఆయనకే పగ్గాలు అప్పజెప్పవచ్చునని అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది.

తాజాగా అభిమానులంతా ఆయన పొలిటికల్ ఎంట్రీ కోసం రోడ్డెక్కడంతో అజిత్ ఎలా స్పందిస్తారన్నది ప్రస్తుతం తమిళనాట ఆసక్తి రేకెత్తిస్తోంది. మరి అజిత్ మనసులో ఏముందో తెలియాలంటే ఆయన పుట్టినరోజు వరకు ఎదురుచూడక తప్పదు!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+