చంద్రబాబుపై పోరు: పవన్ కళ్యాణ్ 2019 ప్లాన్?

హైదరాబాద్: తెలుగు సినీ హీరో, జనసేన పవన్ కళ్యాణ్ మీడియా సమావేశంలో మాట్లాడేసి వదిలేసేట్లు కనిపించడం లేదు. తన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు తీవ్రంగా ధ్వజమెత్తతుండడాన్ని ఆయన తీవ్రంగానే పరిగణిస్తున్నట్లు కనిపిస్తున్నారు. ట్విట్టర్‌ను వేదికగా చేసుకుని ఆయన వారి విమర్శలను తిప్పికొట్టే పనిని పెట్టుకున్నారు.

పవన్ కళ్యాణ్ వ్యవహారాన్ని మాత్రమే కాదు, రాజకీయాలను కూడా ఆషామాషీగా తీసుకోవాలని అనుకుంటున్నట్లు లేరు. ఆయన పక్కా ప్రణాళికతోనే ముందుకు సాగుతున్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేయడంపై దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు. అయితే, దీర్షకాలిక రాజకీయ వ్యూహంతో ముందుకు సాగాలనే ఉద్దేశంతో ఆయన ఉన్నట్లు చెబుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 2019 నాటికి తీవ్రమైన మార్పులు సంభవించే సూచనలు ఎప్పటి నుంచో కనిపిస్తున్నాయి. ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ తెర మీదికి వచ్చేందుకు సిద్ధపడుతున్నారు. చంద్రబాబు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి నారా లోకేష్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలున్నాయి. 2019లో తమ ముఖ్యమంత్రి అభ్యర్థి నారా లోకేష్ అంటూ పలువురు సీనియర్ మంత్రులు కూడా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

Fight against Chandrababu: Pawan Kalyan 2019 plan?

జూనియర్ ఎన్టీఆర్‌ను తెలుగుదేశం పార్టీ నాయకత్వం పోటీ నుంచి తప్పించడంలో చంద్రబాబు విజయం సాధించి, నారా లోకేష్‌ను ముందుకు తెచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ 2014 ఎన్నికల్లో టిడిపి కోసం నిర్వహించే పాత్రను పవన్ కళ్యాణ్ మోశారని అంటున్నారు. చంద్రబాబు అదే బంధాన్ని పవన్ కళ్యాణ్‌తో కొనసాగించాలని భావిస్తూ ఉండవచ్చు. కానీ పరిస్థితులు ఎప్పటికీ ఒకే విధంగా ఉండవు కదా.

పవన్ కళ్యాణ్‌ తెలుగుదేశం పార్టీపై సమరం ప్రకటించే వాతావరణం ఇప్పుడు చోటు చేసుకుంది. బిజెపితో స్నేహాన్ని కొనసాగిస్తూ టిడిపిని ఎదుర్కోవడానికి పవన్ కళ్యాణ్ సిద్ధపడవచ్చు. 2019 ఎన్నికలపైనే దృష్టి పెట్టి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి తాను రాజకీయంగా బలపడాలనే వ్యూహంతో పవణ్ కళ్యాణ్ పనిచేస్తూ ఉండవచ్చునని అంటున్నారు.

ప్రస్తుత పరిస్థితిని చూస్తే తెలుగుదేశం పార్టీని ఎదుర్కుంటే, పవన్ కళ్యాణ్‌ను ఎదుర్కోవడం పెద్ద కష్టం కాకపోవచ్చు. దానికితోడు, బిజెపి స్నేహం కలిసి రావచ్చు. బిజెపితో కలిసి వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాగా వేసేందుకు పవన్ కళ్యాణ్ దీర్ఘ కాలిక ప్రణాళికను రచించుకుని ఉండవచ్చుననే చర్చ సాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+