2017కల్లా వైమానిక యుద్ధ రంగంలో మహిళా పైలట్లు

ఢిల్లీ: మహిళలు త్వరలో యుద్ద విమానాల్లో దూసుకెళ్తూ ధైర్య సాహసాలు చాటనున్నారు. యుద్ధ విభాగాల్లో మహిళలకు అవకాశం కల్పించాలన్న చిరకాల ప్రతిపాదన అమలు దిశగా తొలి అడుగు పడింది. భారత యుద్ధ విమానాల్లో మహిళా పైలట్ల నియామక ప్రతిపాదనను కేంద్రం శనివారం నాడు ఆమోదించింది.

ఎయిర్ ఫోర్స్ అకాడమీలో శిక్షణ పొందుతున్న బ్యాచ్ నుంచి 2016 జూన్ నాటికి మహిళా పైలట్లను నియమించనున్నారు. ఆ తర్వాత ఏడాది పాటు వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి 2017 జూన్ నాటికి పూర్తిస్థాయి పైలట్లుగా నియమిస్తారు.

First in cockpit mid-2017: Govt gives the go-ahead- IAF women pilots can fly fighters

వాయుసేనలో మహిళా పైలట్ల నియామకానికి కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేయడం ద్వారా... సైనిక దళాల్లో నేరుగా యుద్ధ క్షేత్రంలో పని చేసే విభాగాల్లో మహిళలు నియామకం కానుండటం ఇదే తొలిసారి.

ప్రస్తుతం వైమానిక అకాడమీలో శిక్షణ పొందుతున్న బ్యాచ్‌లో నుంచి తొలి మహిళా యుద్ధ విమాన పైలట్లను ఎంపిక చేయనున్నట్లు రక్షణ శాఖ ప్రకటించింది. భారతీయ మహిళల ఆకాంక్షలను, అభివృద్ధి చెందిన దేశాల సైనిక దళాల ధోరణికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+