గుంటూరు: టిడిపివైపు గల్లా, తెనాలిపై కృష్ణ బ్రదర్!

 Galla Jayadev talks with TDP
హైదరాబాద్: కాంగ్రెసు పార్టీ సీనియర్, మంత్రి గల్లా అరుణ కుమారి తనయుడు గల్లా జయదేవ్ తెలుగుదేశం వైపు చూస్తున్నారా? అనే చర్చ జోరుగా సాగుతోంది. ఆయన ఇటీవల తెలుగుదేశం పార్టీ నేతలతో చర్చలు జరుపుతున్నారట. గత ఉప ఎన్నికల్లో తిరుపతి నుండి కాంగ్రెసు తరఫున పోటీ చేసేందుకు జయదేవ్ ఆసక్తి కనబర్చారు. అది నెరవేరలేదు. దీంతో 2014 ఎన్నికలలో చిత్తూరు జిల్లాలోని ఏదో ఒక నియోజకవర్గం నుండి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు.

ఈ నేపథ్యంలో కాంగ్రెసు పార్టీ అధిష్టానం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం, సీమాంధ్రలో ఆ పార్టీ కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తోందనే ప్రచారం నేపథ్యంలో ఆయన తెలుగుదేశం పార్టీతో చర్చలు జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది. గల్లా జయదేవ్ గుంటూరు లోకసభ స్థానం నుండి పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారట. ఇందుకోసం ఆయన తెలుగుదేశం పార్టీ నేతలతో చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది.

మరోవైపు సినీ నటుడు కృష్ణ సోదరుడు ఆదిశేషగిరి కూడా గుంటూరు జిల్లాలోని తెనాలి శాసన సభ నియోజకవర్గం నుండి పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారట. అయితే ఈ నియోజకవర్గం నుండి టిడిపికి చెందిన సీనియర్ నేత ఆలపాటి రాజా ఉన్నారు. దీంతో టిడిపి నేతలు తర్జన భర్జన పడుతున్నారట. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. చర్చలు మాత్రం కొనసాగుతున్నాయంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+