Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

దేవుడు పక్కా కమ్యూనిస్టే.. ఎందుకంటే?, ఇదిగో ఇలా!: చిన్న జీయర్ సంచలనం

కమ్యూనిస్టు సిద్దాంతం సమసమాజ స్థాపనను కోరుతుందని, అలాగే దేవుడు అందరిని సమ దృష్టితో చూస్తాడని, అందరికి అన్ని సుఖాలు అందేలా చేస్తాడని, ఆవిధంగా దేవుడు పక్కా కమ్యూనిస్టు మాదిరి అనుగ్రహిస్తాడని చినజీయర్ స్

ఖమ్మం: ఓ మత ప్రవచకుడి నోటివెంట 'కమ్యూనిస్టు' పదం ఉచ్చరించబడటం ఒకింత ఆశ్చర్యమే. భౌతికవాదాన్ని తప్ప, భావ వాదాన్ని విశ్వసించరాదని చెప్పే కమ్యూనిజాన్ని దేవునితో ముడిపెట్టి మాట్లాడటం మరింత ఆశ్చర్యపరిచే విషయం. తాజాగా త్రిదండి చినజీయర్‌స్వామి చేసిన ఈ తరహా వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

శుక్రవారం ఖమ్మం గ్రామీణ మండలం కస్నాతండా గ్రామంలో నూతనంగా నిర్మించిన వేంకటేశ్వరస్వామి ఆలయంలో ధ్వజ స్తంభ శిఖర ప్రతిష్ఠామహోత్సవాలు, మహాకుంబాభిషేకాలు, విగ్రహ ప్రతిష్ఠ, కార్యక్రమంలో చినజీయర్ స్వామి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన కమ్యూనిస్టు సిద్దాంతాన్ని ప్రస్తావిస్తూ.. దేవుడు చెప్పేది, కమ్యూనిస్టు సిద్దాంతం చెప్పేది రెండూ ఒకటేనని అన్నారు.

Chinna jeeyar

కమ్యూనిస్టు సిద్దాంతం సమసమాజ స్థాపనను కోరుతుందని, అలాగే దేవుడు అందరిని సమ దృష్టితో చూస్తాడని, అందరికి అన్ని సుఖాలు అందేలా చేస్తాడని, ఆవిధంగా దేవుడు పక్కా కమ్యూనిస్టు మాదిరి అనుగ్రహిస్తాడని చినజీయర్ స్వామి పేర్కొన్నారు.

ప్రజలు ఒక్కో రూపంలో దేవున్ని పూజిస్తారని, ఏ రూపంలో భగవంతున్ని ప్రార్థించినా దేవుని స్వరూపం ఒక్కటేనని చినజీయర్ అన్నారు. దేవుడు ఎక్కడో లేడని, చుట్టూ ఉన్న వస్తువులు, కంటికి కనిపించే గాలి, ఇలా ప్రతి చోట ఆయన ఉన్నాడని తెలిపారు. దేవుని దర్శనం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదని ఏ వస్తువును పూజించినా అందులో దేవుడు ఉంటాడని చెప్పారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా హాజరయ్యారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+