16 గంటల సిడ్నీ కేఫ్ చెరను ఎలా ఛేదించారు?

సిడ్నీ: ఆగంతకుడు సిడ్నీలోని లిండ్ చాకొలేట్ కేఫ్‌ను తన ఆధీనంలోకి తీసుకోవడం సోమవారం ఉదయం గం.9.45 నిమిషాలకు ప్రారంభమైంది. అత్యంత రద్దీగా ఉండే ప్రాంతం అది. ఉదయం పూట కాఫీ కోసం దాంట్లోకి అడుగు పెట్టిన చాలా మందిని ఆగంతకుడు కేఫ్‌లో నిర్బంధించాడు. వందలాది మంది పోలీసులు సిడ్నీ వీధులను, దుకాణాలను ఖాళీ చేయించారు.

రద్దీగా ఉండే మార్టిన్ ప్లేస్‌కు రావద్దని ప్రజలకు సూచించారు. ఆ ప్రాంతంలో ఆస్ట్రేలియా రిజర్వ్ బ్యాంక్, రెండు దేశాల ప్రధాన కార్యాలయాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. కొద్ది బ్లాక్స్ దూరంలో పార్లమెంటు ఉంది. సిడ్నీ ఒపెరా హౌస్ కూడా సమీపంలోనే ఉంది.

How the Sydney hostage crisis unfolded?

ప్రజలు ఊపిరి బిగబట్టి, కేఫ్ అద్దాల వైపు చూస్తూ ఉత్కంఠగా చూస్తూ కనిపించారు. చానెల్ 10కు సాయుధుడు తన డిమాండ్లతో పంపిన వీడియోను స్వీకరించింది. దాన్ని ప్రసారం చేయవద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు. సాయుధుడితో మాట్లాడవద్దని, అతనికి పోలీసులతో మాట్లాడాలని సూచించాలని అడిగారు. ఆస్ట్రేలియా ముస్లిం గ్రూపులు నిర్బంధాన్ని ఖండించాయి.

సంఘీభావం తెలుపుతూ ఆస్ట్రేలియన్లు ముస్లిం వేషధారణలో ట్విట్టర్‌లో పోస్టులు చేస్తూ వచ్చారు. ఏడు నెట్‌వర్క్ టెలివిజన్ న్యూస్ సిబ్బంది సాయుధుడిని చూశారు. కేఫ్‌కు ఎదురుగా ఉన్న తమ సిడ్నీ కార్యాలయాల్లోని కిటికీల ద్వారా నాలుగో అంతస్తులోని బందీలను చూశారు.

How the Sydney hostage crisis unfolded?

సాయుధుడి వీపు మాత్రమే కనిపించింది. పంప్ యాక్షన్ షాట్‌గన్ వంటిది పట్టుకుని అతను ఉన్నాడని రిపోర్టర్ క్రిస్ రీజన్ చెప్పారు. గడ్డం పెంచుకున్న అతను తెల్ల చొక్కా, నల్ల టోపీ ధరించి ఉన్నట్లు తెలిపారు. బందీల చోట్లను సాయుధుడు మారుస్తూ కనిపించాడు. కేఫ్ వంటగదిలోంచి సిబ్బంది ఆహారం తెచ్చి బందీలకు పెట్టారు.

How the Sydney hostage crisis unfolded?

రాత్రి కాగానే కేఫ్‌లోని లైట్లను ఆర్పేశారు. లోపలి నుంచి గన్ షాట్స్ వినిపించిన వెంటనే పోలీసులు లిండ్ కేఫ్‌పై దాడి చేశారు. గన్‌ఫైర్ మధ్య పోలీసులు మంగళవారంనాడు ఉదయం బందీలను ఇరాన్‌కు చెందిన సాయుధుడి నుంచి బందీలను విడిపించారు. ముగ్గురు మరణించినట్లు, వారిలో సాయుధుడితో పాటు మరో ఇద్దరు మరణించారని పోలీసులు తెలిపారు. నలుగురు గాయపడ్డారు. సాయుధుడిని హరోన్ మోనిస్‌గా గుర్తించారు. అతనిపై పలు కేసులు ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+