హైదరాబాద్ పోలీసు: పోస్టింగ్‌లపై స్థానిక రగడ?

Hyderabad police: Local controversy
హైదరాబాద్‌: ఉమ్మడి రాజధానిలో పోలీసు అధికారుల పోస్టింగ్‌లపై వివాదం ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని పోలీసు స్టేషన్ల అధిపతులుగా (స్షేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ - ఎస్‌హెచ్‌వో) తెలంగాణకు చెందిన వారినే నియమించాలంటూ తెలంగాణ పోలీసు సంక్షేమ సంఘం ప్రతినిధులు డిమాండ్‌ చేస్తున్నారు.

సీమాంధ్రకు చెందిన ఇన్స్‌పెక్టర్లను పక్కన పెట్టాలని ఉన్నతాధికారులను కోరుతున్నారు. హైదరాబాద్‌లో మొత్తం 8వేల మంది సిబ్బంది ఉన్నారు. హైదరాబాద్‌ ఫ్రీజోన్‌గా ఉన్నప్పుడు వివిధ జిల్లాలకు చెందిన వారు ‘హైదరాబాద్‌ సిటీ పోలీస్‌' విభాగంలో ఇన్స్‌పెక్టర్లు, ఎస్‌ఐలు, హెడ్‌కానిస్టేబుల్‌, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ప్రస్తుతం వీరంతా ఇక్కడే వివిధ విభాగాల్లో పనిచేస్తున్నారు.

హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో 60 పోలీసు స్టేషన్లు ఉన్నాయి. మరో 25 ట్రాఫిక్‌ పోలీసు స్టేషన్లు ఉన్నాయి. స్పెషల్‌ బ్రాంచ్‌, సీసీఎస్‌ల విభాగాల్లోనూ రెండు ప్రాంతాలకు చెందిన అధికారులు, సిబ్బంది పనిచేస్తున్నారు. సీమాంధ్రకు చెందిన సీఐలను ఇతర విభాగాలకు బదిలీ చేసి ఎస్‌హెచ్‌వోలుగా తమనే నియమించాలని తెలంగాణ పోలీసు సంక్షేమ సంఘం కోరినట్లు తెలుస్తోంది.

అప్పట్లో ఫ్రీజోన్‌లో ఉద్యోగాలకు ఎంపికైనందున తామంతా హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ పరిధిలోకి వస్తామని, పోస్టింగుల్లో తమపై వివక్ష ప్రదర్శించడం కుదరదని సీమాంధ్ర ప్రాంత సీఐలు చెబుతున్నారు. విభజన ఉద్యమం, వివాదాల నేపథ్యంలో రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు కూడా హైదరాబాద్‌లోని ఠాణాల్లో చాలావరకు ఎస్‌హెచ్‌వోలుగా తెలంగాణకు చెందిన వారినే నియమించారు. సీమాంధ్రకు చెందిన సీఐలు ఇతర విభాగాల్లోనే ఎక్కువగా ఉండేవారు.

సార్వత్రిక ఎన్నికల ముందు భారీ స్థాయిలో బదిలీలు జరిగాయి. హైదరాబాద్‌, సైబరాబాద్‌ల్లో పని చేస్తున్నవారు అటూ ఇటూ మారారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని పలు స్టేషన్లకు సీమాంధ్రకు చెందిన వారు ఎస్‌హెచ్‌వోలుగా నియమితులయ్యారు. ఎన్నికలు ముగిసి, రాష్ట్ర విభజన కూడా పూర్తయిన నేపథ్యంలో తిరిగి బదిలీలు చేపట్టి ఎస్‌హెచ్‌వోలుగా తమనే నియమించాలని తెలంగాణ ఇన్స్‌పెక్టర్లు కోరుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+