సర్వే: దక్షిణాదిన బీజేపీ ప్రభుత్వం, కర్నాటకలో 150 సీట్లు

ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో అద్భుత విజయం సాధించిన, గోవా, మణిపూర్‌లలో ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన బీజేపీకి మరో సంతోషకరమైన విషయం. దక్షిణాదిన మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు కనిపించనున్నాయి.

బెంగళూరు: ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో అద్భుత విజయం సాధించిన, గోవా, మణిపూర్‌లలో ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన బీజేపీకి మరో సంతోషకరమైన విషయం. దక్షిణాదిన మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు కనిపించనున్నాయి.

ఇటీవల జరిగిన అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ అద్భుత విజయం సాధించింది. దక్షిణాదిన గతంలో కర్నాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని జారవిడుచుకుంది.

In Karnataka BJP will win 129-150 seats says survey

అయితే, తాజాగా బీజేపీ చేసిన సొంత సర్వేలో కమలం పార్టీ అద్భుత విజయం సాధిస్తుందని తేలింది. కర్నాటకలో 225 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో బీజేపీ 129 స్థానాల నుంచి 150 స్థానాల వరకు గెలుచుకుంటుందని ఓ సర్వే తేల్చింది.

బీజేపీ ఒక్కటొక్కటిగా రాష్ట్రాలలో అధికారాన్ని చేపడుతోంది. కర్నాటకలో పోటీ చేస్తే ఎన్ని చోట్ల గెలుస్తామని బీజేపీ అంతర్గతంగా సర్వే చేసింది. ఇందులో 150 నుంచి 160 సీట్ల వరకు వచ్చినట్లుగా తెలుస్తోంది. తక్కువలో తక్కువగా 129 సీట్లు గెలుచుకుంటుందని ఆ సర్వేలో తేలింది.

ఈ సర్వేలో కాంగ్రెస్ పార్టీకి 50 స్థానాలు, జేడీ(ఎస్) 22 సీట్లు గెలుచుకుంటాయని సర్వేలో తేలింది. మిగతా స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు గెలుస్తారు. ఎవరి మద్దతు లేకుండా బీజేపీ సొంతగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సీట్లను 2018 ఎన్నికల్లో సాధిస్తుందని తేలింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+